రష్యా కొనసాగిస్తోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌లో నగరాలు వణికిపోతున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లిపోగా మరికొన్ని నగరాలు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. రాజధాని కీవ్ పై కూడా రష్యా సేన దాడి చేయగా.. ఉక్రెయిన్ బలగాల ఎదురుదాడులతో వెనుదిరిగింది. పాక్షికంగా దెబ్బతిన్న కీవ్ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రోజువారీ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో […]
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్‌లోని ఓ పర్వత ప్రాంతంలో ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ వ్యాను 1,572 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. Bhadradri: ఆగంతకుల దుశ్చర్య.. రాముడిని వదల్లేదు బలూచిస్థాన్ రాష్ట్రంలోని ఝోబ్ నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగిందని పాకిస్థాన్ వార్తా సంస్థ ‘డాన్’ వెల్లడించింది. […]
ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోగా.. ట్విటర్‌ను కొనుగోలు చేసేకంటే ముందు మస్క్ ట్విటర్‌పై విమర్శల దాడికి దిగారు. క్రమక్రమంగా ట్విటర్‌ను కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎలన్ మస్క్ దృష్టి యూట్యూబ్‌పై పడినట్లు చర్చ జరుగుతుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. మస్క్ వరుస ట్వీట్లతో […]
ఈ నెలలో అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్‌లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరలతో మరో5 ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం. వన్‌ప్లస్ ఈ నెలలోనే “వన్‌ప్లస్ 10ఆర్ లైట్” 5జీని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇదే […]
దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో ధరల తగ్గింపునకు సంబంధించి అన్ని అవకాశాలను కేంద్రం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది. రానున్న ఆరు నెలల పాటు ముడి చమురు సరఫరా కోసం ఒప్పందం చేసుకునేందుకు దేశీయ చమురు సంస్థలు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. […]
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా సుదీర్ఘ కాలం మొదటి స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఆయన కొత్త దిశను చూపడమే కాకుండా ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు. వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటును బిల్‌గేట్స్ మానుకోలేదు. రెగ్యులర్‌గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సూచిస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. […]
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితంరోజుతో పోలిస్తే రూ.100 పెరిగింది. ప్రస్తుతం రూ.52,600 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.400 వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.63,900కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. RBI Repo Rate: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మరో సారి వడ్డీ రేట్లు పెరిగాయ్.. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం […]
ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరో సారి పెంచింది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడు రోజుల చర్చల అనంతరం ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును పెంచి 4.90 శాతంగా ప్రకటించింది.రెపో రేటు లేదా తిరిగి కొనుగోలు చేసే ఎంపిక రేటు […]
భారత వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రపంచ బ్యాంకు మరోమారు తగ్గించింది. 8.7 శాతం వృద్ధిరేటు లభిస్తుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచబ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. వృద్ధిరేటు అంచనాలను 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంటే జనవరి నాటి తొలి అంచనాలతో పోలిస్తే వృద్ధిరేటు అంచనాలను 1.2 శాతం మేర ప్రపంచ బ్యాంక్ తగ్గించినట్లయ్యింది. 2023-24లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి 7.1 […]
ఇక వైద్య చరిత్రలోనే మరో అద్భుతం అనేది ఆవిష్కృతం కానుంది. క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటి ఓ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని మంచి ఫలితాలను సాధించింది. మల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులపై దీన్ని ప్రయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. అంతేకాదు.. ఈ మందు తీసుకున్న బాధితుల్లో పూర్తిగా క్యాన్సర్ వ్యాధి నయం అయిపోయిందట. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. అక్కడి శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ […]