ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా సుదీర్ఘ కాలం మొదటి స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఆయన కొత్త దిశను చూపడమే కాకుండా ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు. వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటును బిల్‌గేట్స్ మానుకోలేదు. రెగ్యులర్‌గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సూచిస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. వాటిని చదవడం ఎంతో మంచిదంటున్నారు. ఆ పుస్తకాలు ఏంటో.. వాటిన చదవడం వల్ల మనకు కలిగే లాభాలను కూడా ఆయన వివరించారు. అవేంటో చూద్దాం.