Smart Phones: స్మార్ట్ఫోన్ల హవా.. అదిరే ఫీచర్లతో కొత్త మోడళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెలలో అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్‌లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరలతో మరో5 ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ ఈ నెలలోనే “వన్‌ప్లస్ 10ఆర్ లైట్” 5జీని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇదే ఫోన్ చైనాలో కొద్ది రోజుల క్రితం వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8100-మ్యాక్స్ ప్రాసెసర్, 8జీబీ /12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ అందించారు. దీని ధర దాదాపు రూ.23,000 ఉంటుందని అంచనా.
Also Read
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
- AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
“వివో టీ2ఎక్స్” స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఈ నెలలో విడుదల కానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్ అందించారు. కెమెరాల విషయానికొస్తే…. టీ2ఎక్స్‌లో వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను వాటర్‌డ్రాప్ కటౌట్‌లో అందించారు. ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర దాదాపు రూ.20,000 ఉండవచ్చని అంచనా.
GDP Forecast: భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంక్
“రియల్‌మీ జీటీ నియో 3టీ”ని మంగళవారం భారత్‌లో రిలీజ్ చేశారు. రియల్‌మీ జీటీ నియో 3టీలో 6.62-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీటీ నియో 3టీ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో రన్ అవుతుంది. వెనుక వైపు 64 ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో షూటర్ అందించారు. ముందు భాగంలో ఫోన్‌లో 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ.29,999గా ఉండవచ్చు.
రెడ్‌మీ నుంచి “రెడ్‌మీ 11 5జీ” ఇండియాలో జూన్ నెలలో రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఫోన్‌లో ఏ50 ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, 2 ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.14,000గా ఉండే అవకాశం ఉంది.
“ఒప్పో రెనో 8 లైట్ 5జీ” ఇప్పటికే స్పెయిన్‌లో లాంచ్ అయ్యింది. ఈ నెలలో ఇండియాలో లాంచ్ కానుంది. ఇందులో 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఆప్షన్ అందించారు. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, రెండు 2ఎంపీ కెమెరాలు ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ ధర దాదాపు రూ.25,000 ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!