నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులతోపాటు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్ స్వామివారిని దర్శించుకోనున్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమాలలో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ప్రాతరారాధన, సేవాకాలం, నివేదన, […]
కొన్ని రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో భాజపా జాతీయ అధికారి ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర దుమారానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన భాజపా.. నుపుర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత నుపుర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపారు. […]
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పో-2022″ను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ ఎక్స్‌పో రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ బయోటెక్ స్టార్టప్ ఎక్స్‌పోను డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)లు నిర్వహిస్తున్నాయి. బీఐఆర్ఏసీ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, బయో-ఇంక్యుబేటర్లు, తయారీదారులు, రెగ్యులేటర్లు, ప్రభుత్వ అధికారులు […]
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై రేప్ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్ధీన్ మాలిక్‌కు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సాదుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే […]
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఊహించిందే జరిగింది. ఈ హత్య కుట్రకు మాస్టర్ మైండ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనే ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న అతడిని పలు దఫాలుగా విచారించిన దిల్లీ ప్రత్యేక పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే పంజాబ్ సిట్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. మే 29వ తేదీన హత్యకు గురయ్యాడు […]
కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని పేర్కొంది. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి అనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు విమాన ప్రయాణికులను హెచ్చరిస్తూ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. కొవిడ్ సేఫ్టీ నిబంధలను […]
రైతులకు ఊరట కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు గానూ 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ కు ఖరీఫ్ పంటల ఎంఎస్‌పీ ఆమోదించబడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 పెంచగా… దీంతో క్వింటాలు వరి రూ.2040కి చేరనుంది. 2021-22 వరి ఎంఎస్పీ […]
టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్‌లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 16ను ఆవిష్కరించింది. కొత్తకొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో దీన్ని తీర్చిదిద్దింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా ఐఓఎస్ 16 (iOS 16)ను ప్రవేశపెట్టింది యాపిల్. ఐఫోన్ 8 సిరీస్ ఆ తర్వాతి మోడల్స్ అన్నింటికీ కొన్ని నెలల్లో ఐఓఎస్ 16 అప్‌డేట్ వస్తుంది. సెప్టెంబర్‌లో ఈ కొత్త వెర్షన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం […]
డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఖాతాలకు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూపే కార్డులతో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. దీని వల్ల వినియోగదారులు మరింత సులువుగా పేమెంట్స్ చేసుకునే వీలుంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సి ఉందని చెప్పింది. యూపీఐలతో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు […]
నీట్ పీజీ సీట్ల భర్తీలో భారత వైద్య మండలి వ్యవహరించిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం సాధించారని మెడికల్ కౌన్సెలింగ్ […]