Smart Phones: రూ.30 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు మీకోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లు సొంతం చేసుకోవాలంటే రూ. 20 వేల నుంచి రూ.30 వేలలోపు బడ్జెట్ ఉంటే సరిపోతుంది. ఈ రేంజ్‌లో లభించేవి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్స్ కావు కానీ ఇవి చాలా తక్కువ ధరలతోనే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను ఆఫర్ చేస్తాయి. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే, చాలా బ్రాండ్‌ల మొబైల్స్ రూ.30 వేల లోపు ధరల్లో బెస్ట్ క్వాలిటీ కెమెరాలతో వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.30 వేల లోపు ఫోన్లలో బెస్ట్ క్వాలిటీ కెమెరాలు గల టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒప్పో రెనో 7 5జీ: ఈ ఫోన్ 8జీబీ వేరియంట్ రూ.28,999కి లభిస్తోంది. ఈ మొబైల్‌లో ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్‌తో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Also Read
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
- Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
- Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎం53: పవర్‌ఫుల్ కెమెరాలతో ఈ మొబైల్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ రూ.26,499కి… 8జీబీ వేరియంట్ రూ.28,499కి దొరుకుతుంది. ఈ మొబైల్‌లో ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్‌తో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, రెండు 2MP డెప్త్, మాక్రో సెన్సార్లు ఆఫర్ చేశారు. ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
రియల్‌మీ 9 ప్రో+: ఈ బెస్ట్ కెమెరాలతో వస్తుంది. ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ ధర రూ.24,999గా, 8జీబీ వేరియంట్ ధర రూ.26,999గా నిర్ణయించారు. ఇందులో 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ కెమెరా అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్, 60వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్‌తో వస్తుంది.
షియోమీ 11ఐ: ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ రూ. 24,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే షియోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఫోన్‌ను రూ.28,999కి మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఫోన్‌లు ఒకే రకమైన కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యాయి. వీటిలో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్‌సెట్, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా వీటిలో అందించారు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ: ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఓఎస్ అయిన ఆక్సిజన్ ఓఎస్‌తో పాటు బెస్ట్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ ధర రూ.23,999, 8జీబీ వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ మొబైల్‌లో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో కీలక ఫీచర్లగా నిలుస్తున్నాయి.
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!