Neeraj Chopra: మరో ఫీట్ సాధించిన నీరజ్ చోప్రా.. కోర్టానే గేమ్స్‌లో స్వర్ణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో ఫీట్ సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత జరిగిన తొలి టోర్నీలో జాతీయ రికార్డు సృష్టించగా, రెండో టోర్నీలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న కోర్టానే గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్.. పసిడిని కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 86.69 మీటర్లు విసిరి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. కాగా, 90 మీటర్ల మార్కును సాధిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ, అది కుదరలేదు. చోప్రా అంతకుముందు గత వారం తుర్కులో 89 మీటర్ల రికార్డును సాధించాడు.
ప్రపంచ ఛాంపియన్, గ్రెనెడా దేశస్థుడు అండర్సన్ పీటర్స్‌ను వెనక్కినెట్టి ఈ పతకం సాధించడం విశేషం. తొలి ప్రయత్నంలో రికార్డు దూరం విసిరిన నీరజ్.. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు. అప్పటికే పతకం ఖాయమైన నేపథ్యంలో మిగిలిన మూడు ప్రయత్నాలు చేయకుండానే విరమించుకున్నాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా బల్లెం విసరడం ఆటగాళ్లకు కష్టమైంది. ఈ క్రమంలోనే మూడో ప్రయత్నంలో నీరజ్ పట్టు కోల్పోయి జారాడు. ట్రినిడాడ్‌కు చెందిన వాల్కట్ కెషోర్న్ బల్లెంను 86.64 మీటర్లు విసిరి రెండోస్థానంలో నిలవగా.. 84.75 మీటర్లు విసిరిన అండర్సన్ పీటర్స్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే 86.89 మీటర్లు విసిరాడు. దీని తర్వాత, అతని తదుపరి ప్రయత్నం ఫౌల్, మూడవ ప్రయత్నంలో అతను జావెలిన్ విసురుతూ జారిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి రిస్క్ తీసుకోలేదు.
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
ఈ ఏడాది జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించాలని చోప్రా లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఇలాగే చేస్తానని, పతకం గెలుస్తానో లేదో ఫలితం వస్తుందో చూద్దాం అని కొద్ది రోజుల క్రితం శిక్షణలో పేర్కొన్నాడు. గతేడాది ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించానని కాదు, ఈ ఏడాది కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలి. భవిష్యత్తు కోసం నేను ఇంకేం చేయగలనో చేస్తాను. కొంత ఒత్తిడి ఉంటుంది, అది సహజమని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు