భర్తపై కోర్టుకెక్కిన మహిళ.. ఆడవారిలా రెడీ అవుతున్నాడు, ఆ పని చేయడంలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన భర్త తరచూ ఆడవారిలా రెడీ అవుతున్నాడని, లిప్‌స్టిక్ పూసుకుంటున్నాడని, పెళ్లై రెండేళ్లయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తపై పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త.. ఆడవారిలా తరచూ రెడీ అవుతున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా లైంగిక సంబంధం పెట్టుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు నెలకు రూ.30 వేలు పరిహారం కింద చెల్లించాలని బాధితురాలి భర్తను ఆదేశించింది.
ఇండోర్‌లోని మహాలక్ష్మినగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ.. అదే ప్రాంతంలో ఉంటున్న 32 ఏళ్ల దిలేశ్వర్‌ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్దిరోజులకే ఆమెను తన భర్తతోపాటు అత్త వేధించడం ప్రారంభించారు. ఆ తర్వాత బాధితురాలిని తీసుకుని దిలేశ్వర్.. పుణెలో కాపురం పెట్టాడు. కొద్దిరోజులకే బాధితురాలి అత్త అక్కడికి కూడా వచ్చింది. బాధితురాలిని తీవ్రంగా వేధించి ఇరువురూ ఇబ్బంది పెట్టారు. ఇక, ఆమె ఎదురుతిరగడం వల్ల కన్నవారింటికి పంపించేశాడు భర్త. ఎన్ని రోజులైనా తీసుకువెళ్లడానికి రాకపోవడం వల్ల ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. హైకోర్టులోనూ పిటిషన్ వేసింది. అప్పుడు ఆ ఫిర్యాదులో తన భర్త వింత చేష్టలను పేర్కొంది.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తన భర్త చేసే వింత చేష్టలను.. పిటిషన్‌లో తెలియజేసింది. పెళ్లైన తర్వాత ఒక్కసారి కూడా తనతో లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని తెలిపింది. తాను ప్రయత్నించినా వేరే గదిలో పడుకునేవాడిని చెప్పింది. సాయంత్రం ఆడవారిలా మేకప్ వేసుకునేవాడని, చెవిపోగులు ధరించేవాడని పిటిషన్‌లో వెల్లడించింది . అలాగే పెదవులకు లిప్‌స్టిక్ పూసుకునేవాడని.. అలా చెయ్యొదని వారించినా చేయి చేసుకునేవాడిని ఆరోపించింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతి నెలా రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!