Revanth: వరంగల్ బయలుదేరిన రేవంత్.. అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ కుంటుంబాన్ని పరామర్శించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు. కాగా ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. అరెస్ట్ గురించి రాతపూర్వకంగా పత్రం ఇస్తేనే పోలీస్‌స్టేషన్‌కు వస్తానంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ చంపిందని.. బీజేపీ చంపించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌కు వెళ్తే వచ్చే ఇబ్బంది ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ మంత్రులు శవయాత్ర చేయొచ్చు కానీ.. తాము వెళ్లడానికి కూడా ఇన్ని ఇబ్బందులు ఎందుకు అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ చావులను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరంటూ ప్రభుత్వంపై ఆగ్రహించారు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తామని రేవంత్ పేర్కొన్నారు.
Also Read
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే యువకులు బలవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అన్నివిధాలా ఆలోచించి, చర్చించి తీసుకురావాల్సిన అగ్నిపథ్ సర్వీసును కేంద్రం హడావుడిగా తీసుకొచ్చిందన్నారు. సైనికులను నాలుగేళ్ల ప్రాతిపదికన నియమించడం దారుణమన్న రేవంత్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన రాకేష్ అంతిమయాత్ర ఉద్రిక్తంగా మారింది. వరంగల్‌లో అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో పోచం మైదాన్ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. పోచం మైదాన్ కూడలి మీదుగా రాకేష్ అంతిమ యాత్ర సాగింది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!