Ai.com Domain Sale: రూ.300 పెట్టి కొంటే రూ.634 కోట్ల లాభం! ఇంటర్నెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ai.com Domain Sale: ఒక వ్యక్తికి ఊహించని విధంగా అదృష్టం తలుపు తట్టింది. ఇంతకీ అసలు కథ ఏమిటంటే.. మలేషియాకు చెందిన అర్స్యాన్ ఇస్మాయిల్ 1993లో $100 (సుమారు 300 రూపాయలు)కి డొమైన్‌ను కొనుగోలు చేశాడు. 1993లో రూ.300లకు కొనుగోలు చేసిన ఈ డొమైన్ 2025లో రూ.634 కోట్లలకు అమ్ముడైంది. ఈ డొమైన్‌ను ఎవరు కొనుగోలు చేశారు, దాని ప్రత్యేకత ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM RAHAT Scheme: “ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల క్యాష్-లెస్ ట్రీట్మెంట్”.. ప్రధాని మోడీ కొత్త పథకం..
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
డొమైన్ పేరు ఏమిటంటే ..
1993లో మలేషియాకు చెందిన అర్స్యాన్ ఇస్మాయిల్ ఒక డొమైన్‌ను కేవలం రూ.300 పెట్టి కొనుగోలు చేశారు. ఆ డొమైన్ పేరు Ai.com. ఈ డొమైన్‌ను 2025లో Crypto.com CEO క్రిస్ మార్స్‌జాలెక్ రూ.634 కోట్లకు కొనుగోలు చేశారు. నిజానికి ఇప్పటి వరకు ఇంటర్నెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఒప్పందంగా చెబుతున్నారు. ఫిన్‌టెక్ మలేషియా నివేదిక ప్రకారం.. 10 ఏళ్ల క్రితం, Ai.com. డోమైన్‌ను కొనుగోలు చేసిన అర్స్యాన్ ఇస్మాయిల్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందన్న అంచనా కూడా లేదు. కేవలం ఆ డోమైన్ అక్షరాలు తన పేరు (అర్స్యాన్ ఇస్మాయిల్) అక్షరాలను పోలి ఉండటం నచ్చి రూ.300 పెట్టి కొనుగోలు చేశాడు. కానీ AI వచ్చిన తర్వాత టెక్ పరిశ్రమ కొత్త రూపాన్ని సంతరించుకుంది. 1993లో ai.com కొనుగోలు చేయడం అర్స్యాన్ ఇస్మాయిల్ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయంగా మారింది.
100 మిలియన్ల వరకు ఆఫర్లు..
2025లో అర్స్యాన్ ఇస్మాయిల్ తన డొమైన్‌ను అమ్మకానికి లిస్ట్ చేశాడు. ఆ టైంలో తనకి $100 మిలియన్ల వరకు ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన $70 మిలియన్లకు తన డొమైన్‌ను అమ్మడానికి డీల్ చేసుకున్నాడు. ఏప్రిల్ 2025లో అర్స్యాన్ ఇస్మాయిల్ తన డొమైన్ పేరును క్రిస్ మార్జాలెక్‌కు దాదాపు $70 మిలియన్లకు (సుమారు రూ. 634 కోట్లు) విక్రయించాడు. ఆ మొత్తం చెల్లింపు క్రిప్టోకరెన్సీలో జరగడంతో ఈ ఒప్పందం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది బహిరంగంగా నివేదించిన అత్యంత ఖరీదైన డొమైన్ అమ్మకం అని నివేదికలు సూచిస్తున్నాయి. ఫిన్‌టెక్ మలేషియా నివేదిక ప్రకారం.. ఈ ఒప్పందం 2010లో CarInsurance.com నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. ఆ డొమైన్ $49.7 మిలియన్లకు అమ్ముడైంది.
READ ALSO: Pawan Kalyan: మాస్ మహారాజాకు పవర్ ఫుల్ హిస్ట్స్ ఇచ్చిన పవర్ స్టార్! ఎలాగో చూసేయండి..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!