YS Sharmila: పాలేరు నుంచి పోటీ చేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కోరిక మేరకు తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాలేరు నియోజక వర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫోటో పెట్టుకొని గెలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్సార్ వారసత్వం కేవలం ఆయన బిడ్డగా తనకే ఉందన్నారు. ఇతర వ్యక్తికి.. ఇతర పార్టీకి ఆ హక్కులేదన్నారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానం మన ఆస్తి అన్నారు షర్మిల.
ఖమ్మం జిల్లా అంటే వైఎస్సార్ జిల్లా అని.. ఖమ్మం జిల్లాకు గడప మన పాలేరు నియోజకవర్గమన్నారు. వైఎస్సార్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అనే కోరిక ఈ రోజుది కాదని.. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉందని వెల్లడించారు. ముఖ్యంగా వినిపిస్తున్న స్వరం పాలేరు నుంచి పోటీ చేయాలని… అడుగడుగునా హారతులు పట్టుకుంటూ ప్రతి గ్రామంలో అందరూ చెప్తున్నారని స్పష్టం చేశారు. పాలేరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు కాబట్టి దేవుడు తధాస్తు అంటాడు అని నా గట్టి నమ్మకమన్నారు. ఇవ్వాళ్టి నుంచి పాలేరులో పోటీ చేయాలనేది మీ కోరిక కాదు… నా కోరిక కూడా అని పేర్కొన్నారు. వైఎస్సార్ పార్టీ పతాకం పాలేరు గడ్డ పై ఎగరాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. అత్యధిక మెజారిటీ కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు అని.. ఇక్కడి ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతానని ఆమె అన్నారు.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
“వైఎస్సార్ సైనికులుగా అందరినీ ఒక తాటి మీదకు తేవాలి. ఏ కార్యక్రమం చేపట్టినా పాలేరు పుట్టిన ఇల్లు. పాలేరు నియోజక వర్గం ఒక దిశానిర్దేశం అవ్వాలి. ముందు వరసలో పాలేరు ఉండాలి. పార్టీ అభివృద్ధిలో ఎక్కడ లేనంత ముందు వరసలో ఉండాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి. ప్రజలకు మీరు ఉన్నారన్న భరోసా కల్పించాలి. షర్మిలమ్మ మన నియోజక వర్గం అని చెప్పాలి. మీరు ముందు ఉండాలి ..అందరికీ ఆదర్శం అవ్వాలి” అని వైఎస్సార్‌టీపీ కార్యకర్తలకు షర్మిల సూచించారు.
Governor: దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి విద్య అనేది ఎంతో అవసరం
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!