నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలింది. దీంతో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెలిమినేడు, పేరేపల్లి, పిట్టంపల్లి, బొంగోనిచెరువు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దగ్గు వాంతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రియాక్టర్ నుంచి వెలువడిన విషవాయువుల గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.