తూర్పుగోదావరి : కోనసీమలో కరోనా కలకలం రేపుతోంది.. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమలాపురం డివిజన్ పరిధిలో ఏకంగా 10 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో ఒక సిఐ, ఐదుగురు ఎస్ ఐ లకు నలుగురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోనసీమలో దసరా ఉత్సవాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. కరోనా […]
అనంతపురం : ప్రశాంత్ కిషోర్ కాదు… వాళ్ల నాన్న.. తాతకు కూడా భయపడేది లేదని… చంద్రబాబు రాజకీయాల్లో నుంచి ఇక తప్పుకోవాలని.. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. వంటగ్యాస్ మొదలు నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యులు, పేదలు అల్లాడిపోతున్నారని… యువతకు మత్తు మందులు అలవాటు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 20 వేల కోట్ల విలువైన మత్తు మందు పట్టుకుంటే అమిత్ షా అసలు ఎందుకు మాట్లాడరని…. ఏ మంత్రులు నోరువిప్పటంలేదని […]
కడప జిల్లా బద్వేల్ లో భారీ వర్షం కురుస్తోంది.. ఇవాళ వేకువ జాము నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బద్వేల్ పోలింగ్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే… వర్షం లో నైనా పోలింగ్ సామాగ్రిని తీసుకెళుతుంది ఎన్నికల సిబ్బంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షంలోనైనా… తమ డ్యూటీ ని సక్రమంగా నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే.. రేపు కూడా వర్షం బాగా పడితే.. పోలింగ్ శాతం తగ్గే […]
చిత్తూరు : మరికాసేపట్లోనే కుప్పం పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సొంత నియోజక వర్గం లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు నాయుడు…. రెండు గంటలకు బస్టాండ్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం వరకు కుప్పం అంతటా రోడ్ షో లు, నాయకుల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేయనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు […]
వరి సాగుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వరి వేస్తే ఉరేనని… వరి విత్తనాలు అమ్మితే… ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తప్పవని సినిమా రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి. అయితే..కలెక్టర్ వెంకట్రామారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అటు ప్రతి పక్ష కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే… సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలకు […]
జీఎస్టీ పరిహారం బదులుగా రుణాలను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి 44 వేల కోట్లు రిలీజ్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.59 లక్షల కోట్లు విడుదల చేసింది కేంద్రం.కరోనా సెకండ్‌వేవ్, లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. సగానికి సగం ఆదాయం పడిపోయింది. ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాయ్. ఐతే రాష్ట్రాలకు ఊతం ఇచ్చేందుకు ముందుకొచ్చింది కేంద్రం. […]
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,348 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 805 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 13,198 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,46,157 […]
హుజురాబాద్‌లో గెలుపు బీజేపీకి అవసరం… ఈటల రాజేందర్‌కి అత్యవసరం. ఈటల దశాబ్ధాల రాజకీయ భవిష్యత్ ఈ ఎన్నికతో ముడిపడి ఉంది. దుబ్బాకలో గెలిచిన తర్వాత.. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక హుజురాబాద్. టీఆర్‌ఎస్‌కు ధీటుగా, పోటీగా బీజేపీ కూడా చతురంగ బలగాలను మోహరించింది. బీజేపీ ప్రచారానికి ఫలితం దక్కుతుందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే కసితో ఉంది కమలదళం. దుబ్బాక పోరులో విజయం సాధించడం, గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చూపించడంతో.. కమలంపార్టీ నేతల్లో […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌ని కలవనున్నారు. ఇటలీలో జరిగే జీ-20 సమావేశానికి వెళ్లిన మోడీ…అటు నుంచి వాటికన్ సిటీకి వెళ్లి పోప్ ఫ్రాన్సిస్‌ని కలవనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. అయితే ఇది ఇంకా ఫైనల్ కాలేదు…ఇరు వైపుల అధికారులు సమావేశం సమయాన్ని నిర్ణయించి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. పోప్‌తో సమావేశంపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని… త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. […]
హుజూరాబాద్‌ఉపఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. రేపు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడింటి వరకు పోలింగ్ జరగనుంది. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నందన పోలింగ్ సమయాన్ని కూడా పెంచారు. మొత్తం 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2లక్షల 37వేల 36 మంది ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. వీరిలో పురుషులు లక్షా 17వేల 933 మంది, మహిళలు లక్షా 19వేల 102 మంది ఉన్నారు. కరోనా సోకిన వారు సైతం సాయంత్రం సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేలా […]