హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగ్ కోట్లల్లో నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది..ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పెద్దఎత్తున పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో రహస్యంగా కొనసాగుతోంది. ఆఫ్‌లైన్‌లో సైతం బెట్టింగులు సాగుతున్నాయ్. హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపు ఓటములపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు సైతం బైపోల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ ముగియడంతో పందెంరాయుళ్లు ఉపఎన్నికపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గత నెల నుంచే బెట్టింగ్ […]
అమరావతి : ఏపీలో డ్రగ్స్, గంజాయి మాఫియాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 2018 లోనే ఏపీ-ఒడిస్సా బోర్డరులో గంజాయి రవాణ, మాఫియా వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయంటూ ట్వీట్ చేశారు పవన్. డ్రగ్స్ మూలాలు ఏపీలోనే ఉన్నాయంటూ హైదరాబాద్ సీపీ నల్గొండ ఎస్పీ ప్రకటనల క్లిప్పిగులను ట్వీట్టర్లో పోస్ట్ చేసిన పవన్. ఏపీ-ఒడిశా బోర్డరులోని గిరిజన ప్రాంతాల్లో 2018లో చేపట్టన పోరాట యాత్రలో గంజాయి మాఫియాపై చాలా ఫిర్యాదులు వచ్చాయని… […]
అమరావతి : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కు మరో బిగ్ షాక్ తగిలింది. ధూళిపాళ్ల నరేంద్రపై తాజాగా ఏపీ ప్రభుత్వం మరో అస్త్రం వదిలింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది సర్కార్. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ప్రభుత్వం తరఫున నోటీసులు జారీ చేశారు. వారం […]
ఇండియా లో ఇవాళ కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 13,451 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 585 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 14,021 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,15,653 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,35,97,339 కి […]
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసిస్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. స్పైవేర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి…ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాము సంప్రదించిన నిపుణుల్లో కొందరు…వ్యక్తిగత కారణాలతో కమిటిలో భాగస్వాములు కాలేకపోయారని…ఈ […]
తెలంగాణలో నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కి నెత్తిటి బాకీ తీర్చుకుంటాం అన్న హెచ్చరికలు మన్యంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పోలీసులు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ బంద్‌కు పిలుపునిస్తూ లేఖ విడుదల చేసింది. ప్రభుత్వం విప్లవకారుల్ని హత్యలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే ప్రతీకార చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏక్షణం ఎలాంటి […]
వాడివేడిగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. మరి కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉండడంతో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచార వేడి తారస్థాయికి చేరింది. ఈ ఉపఎన్నికలో గెల్చి, మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈటల గెలుపుతో ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే, చాపకింద నీరులా హస్తం పార్టీ ప్రచారం సాగుతోంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో.. ఓటర్ను […]
టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది పాక్. న్యూజిలాండ్ విధించిన 135 పరుగుల టార్గెట్‌ను 5వికెట్ల ఉండగానే ఛేజ్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అయితే పాక్ ఫామ్‌కు కివీస్ నిర్దేశించిన లక్ష్యం ఏ మాత్రం సరిపోదని అంతా అనుకున్నారు. కానీ, పిచ్ పరిస్థితులు, వ్యూహాలు, బౌలింగ్‌లో వైవిధ్యంతో కివీస్ ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసింది. చేజింగ్‌లో పాక్ ఆదిలో కాస్త […]
ఇండియాలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన.. పసిడి ధరలు ఇవాళ కూడా ఎగిసి పడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45, 200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 49, 150 కి చేరింది. అయితే… బంగారం ధర పెరిగితే…వెండి ధరలు మాత్రం […]
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఏపీ, తెలంగాణలో పొలిటికల్ సెగలు.. పొగలు కక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ ప్లీనరీ నుంచి కీలక కామెంట్స్ చేశారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. ఏపీ పిలుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంతకీ కేసీఆర్‌ను ఏపీ నుంచి ఎవరు పిలిచారు? ప్లీనరీలో చేసిన కామెంట్స్ వెనక ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్..! ఏపీ పిలుస్తోందన్న కేసీఆర్ మాటల వెనక చాణక్యం? […]