బద్వేల్ బై ఎలక్షన్ లో ఉదయం 11 గంటల వరకు 20.89% పోలింగ్ నమోదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ వెల్లడించారు. మాక్ పోలింగ్ సమయం లో ఒకటి రెండు పని ఈవీఎమ్ లు పని చేయకపోతే వెంటనే రిప్లేస్ చేశామని ఆయన ప్రకటించారు. ఎక్కడా ఈవీఎమ్ లు మొరాయించి పోలింగ్ ఆలస్యం అయిన సంఘటన ఎదురవలేదని స్పష్టం చేశారు ఎన్నికల అధికారి. ఉదయం 9 గంటల వరకు 10.49% పోలింగ్0 నమోదయ్యిందని.. […]
ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు మరియు హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ.. బీజేపీ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు ఓవైసీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మొత్తం 100 స్థానాల్లో పోటీ… చేయనుందని.. ఓవైసీ తెలిపారు. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా అసదుద్దీన్ ఓవైసీ.. […]
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల కు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే… ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన ఈ ఉప ఎన్నికలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజురాబాద్ వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్కల్ లో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్న కార్యకర్తల్లో మహిళలు […]
మన దేశంలో ఇవాళ కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 549 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 13,543 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,61,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల […]
టీఆర్ఎస్ ప్లీనరీ కేడర్‌లో జోష్ తీసుకొస్తే.. కొన్ని జిల్లాల్లో అసంతృప్త జ్వాలలను రాజేసింది. ఆహ్వానాల విషయంలో వివక్ష చూపించారని మంత్రిపై చింతనిప్పులు తొక్కుతున్నారు నేతలు. ఎవరా మంత్రి? ఏంటా జిల్లా? ప్లీనరీ పాస్‌లపై మేడ్చల్ టీఆర్ఎస్‌లో రగడ..! టీఆర్ఎస్ ప్లీనరీకి మేడ్చల్ జిల్లా నుంచి 200 మంది ముఖ్యనేతలకు పాసులు జారీ చేశారు తెలంగాణ భవన్ సిబ్బంది. జిల్లాలో పీర్జాదిగుడా, బోడుప్పల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ప్లీనరీకి వార్డు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కూడా పాసులు […]
ఏపీ టీడీపీ అధ్యక్షుడు.. మాజీ అధ్యక్షుడి మధ్య వార్ నడుస్తోందా? పార్టీ నుంచి బహిష్కరించిన నేతకు ప్రాధాన్యం ఇవ్వడంతో నిప్పు రాజుకుందా? శ్రీకాకుళం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన సంఘటనలు ఏంటి? లెట్స్ వాచ్..! కళా వెంకట్రావు వ్యతిరేక వర్గానికి అచ్చెన్న దన్ను..? అచ్చెన్నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు. కళా వెంకట్రావు.. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు. ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. పైకి నవ్వుతూ కనిపించినా.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందన్నది పార్టీలో […]
బద్వేల్ ఉపఎన్నికపై బీజేపీ లెక్కలేంటి? అధిష్ఠానం నేరుగా జోక్యం చేసుకున్న ఈ ఉపఎన్నికలో కమలనాథుల అంచనాలు ఎలా ఉన్నాయి? టీడీపీ పోటీలో లేకపోవడంతో.. ఆ పార్టీ ఓటు బ్యాంక్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలేంటి? 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735 బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కేడర్ కూడా అంతంత మాత్రమే…! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 735. నాడు బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి వైసీపీ నుంచి […]
మత్తు రాజకీయంలోకి జనసేన కూడా ఎంటరైందా? ఇరికించామని టీడీపీ.. కౌంటర్ ఇచ్చామని అధికార పార్టీ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తెర మీదకు వచ్చారు జనసేనాని. పొలిటికల్‌గా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారా? లేక చంద్రబాబు మనిషిగానే పవన్ కల్యాణ్ కామెంట్స్ పాస్ చేశారా? గంజాయిపై వరసగా ట్వీట్స్ రిలీజ్ చేస్తోన్న పవన్..! ఏపీలో రాజకీయం మత్తులో జోగుతోంది. ఉదయం లేచింది మొదలు అధికార పార్టీ.. ప్రతిపక్ష టీడీపీ.. డ్రగ్స్.. హెరాయిన్.. గంజాయి అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. […]
టీడీపీ పార్టీ పై మరోసారి వైసీపీ నేత, రాజ్య సభ్యులు విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఉన్మాదుల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని… రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దొంగల ముఠాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్నారు. అందుకే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరామని స్పష్టం చేశారు విజయ సాయిరెడ్డి. అసభ్య పదజాలంతో దూషిస్తున్న టీడీపీ నేతలు నారా లోకేష్, పట్టాభి, […]