కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బిజేపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిలో అనేక మంది అధికార పార్టీ నేతలు హస్తం ఉందని..ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విష్ణు వర్ధన్ రెడ్డిమండిపడ్డారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని..చేతల్లో చర్యలు లేవన్నారు. ప్రయివేటు ఆసుపత్రిలో ఎక్కడైనా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు ఏ ఒక్కరైనా ఆధారాలతో నిరూపించగలరా? రాష్ట్రంలో 514 ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారు.. కనీసం 10 శాతం బెడ్లు కేటాయించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే ఆక్సిజన్, రేమిడిసివియర్ మందులు బ్లాక్ లో అమ్ముకొని దోపిడి చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతోందన్నారు. సీఎం, మంత్రులు ఒక్క ఆసుపత్రిని అయినా సందర్శించారా? అని నిలదీశారు. ఇక పరిషత్ ఎన్నికల రద్దుపై ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, సుప్రిం కోర్టు మార్గదర్శకాలు పాటించలేదని..కాబట్టే కోర్టు ఎన్నికలు రద్దు చేసిందని పేర్కొన్నారు. సీఎస్ మరియు ఎస్ఈసీల జీతం నుంచి వసూలు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయనారు.