బడ్జెట్ నేపథ్యంలో నిన్న ఏపీ అసెంబ్లీ ఒకరోజు సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో బడ్జెట్ తో సహ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే దీనిపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సిఎం జగన్ ఒక్కసారి హామీ ఇస్తే.. కచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాడని విజయసాయిరెడ్డి కొనియాడారు. “హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం – సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే మాటిచ్చారు…అసెంబ్లీలో తీర్మానం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వమిది.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో టిడిపి పై నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. “ఏమి నాటకాలయ్యా చంద్రం! అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది. అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు. పచ్చ నేతలే స్పీకర్ – మంత్రులట! ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు. ఇంతకీ పుత్రరత్నం లోకేశంకి ఏం మంత్రి పదవిచ్చాడో బాబు?” అంటూ ఎద్దేవా చేశారు.
హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం – సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే మాటిచ్చారు…అసెంబ్లీలో తీర్మానం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వమిది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 21, 2021