ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సీఎంకు స్వాగతం పలుకగా అనంతరం కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ ఉన్న కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులకు భరోసా ఇచ్చారు. ఎంజీఎం పర్యటన అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లారు.కోవిడ్ వార్డులో పిపిఈ కిట్స్ లేకుండా కోవిడ్ వార్డు లోకి వెళ్లిన కేసీఆర్. కెప్టెన్ లక్మికాంత రావు ఇంటిలో స్నానం చేసి లంచ్ చేశారు. ఆ తరువాత వరంగల్ సెంట్రల్ జైలు చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జైలు ప్రాంగణంలోని 73 ఎకరాల్లో కొత్త ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. ఆ తర్వాత ఖైదీలతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఖైదీలు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అలాగే జైలు ప్రాంగణం గురించి అడిగి తెలుసుకున్నారు.