ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే కోవిడ్–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిఎం జగన్. ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించామని…అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత […]
ఏపీ సర్కార్ పై జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని..రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా ఉపయోగించడం లేదని సమాచారం ఉందన్నారు. “కరోనా” కేసుల్లో ఏపీ 5వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో ఉందని.. ఇంత దారుణ పరిస్థితి ఏపీలో ఎందుకు నెలకొంది? అని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు. ఏపీలో సరైన సంఖ్యలో టెస్టులు […]
ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా నాలుగు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 19,981 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…118 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 18,336 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060 కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,683 గా ఉంది. కోవిడ్ బారినపడి మృతి […]
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 41 లోని ఓ హోటల్ ఓయో రూంపై దాడులు చేసి ముగ్గులు సెక్స్ వర్కర్లను, ఇద్దరు విటులు, ఒక నిర్వహకుడిని పొలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్ వేసి..ఓయో రూంపై దాడులు చేశారు. వ్యభిచార గృహ నిర్వహకుడిని అశ్విన్ గా గుర్తించారు. విటులను అల్వాల్ కు చెందిన వ్యాపారి రాహుల్ సురాన, కూకట్ పల్లి నిజాంపేటకు చెందిన […]
టీఆర్ఎస్ సర్కార్ పై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పదికోట్ల ఆస్పత్రిని గత ఏడేళ్లుగా నిరుపయోగంగా టిఆర్ఎస్ సర్కార్ వదిలేసిందని.. కెసిఆర్ సర్కార్ వెంటనే ఖైరతాబాద్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా మార్చి పేద ప్రజలందరికీ ఇన్-పేషెంట్ కరోనా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఎందుకు ఈ ఆస్పత్రులను పర్యటించి కోవిడ్ ఆస్పత్రులుగా మార్చడం లేదలని.. […]
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని..క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధుల స్పష్టం చేశారు. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో కమలాపూర్ మండల నాయకుల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే పనిచేస్తామని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం […]
కృష్ణపట్నం కరోనా మందులానే రాజమండ్రిలోనూ మహమ్మరికి మందు తయారు చేస్తున్నారు. ఈ కరోనా మందును ఆయుర్వేద వైద్యుడు వసంత్ కుమార్ తయారు చేస్తున్నారు. 30 ఏళ్లుగా వసంత్ కుమార్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు.అదే అనుభవంతో వసంత్ కుమార్ కూడా కరోనాకు మందు తయారు చేస్తున్నాడు. అన్ని వనములికలతో చేస్తున్న ఈ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవని వసంత్ కుమార్ చెబుతున్నాడు. వసంత్ కుమార్ పై నమ్మకంతో చాలా మంది అతని దగ్గరికి వస్తున్నారు. ప్రతి […]
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని […]
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండడంతో.. ఇప్పుడు వేలాది మంది అటు పరుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. అయితే ఈ మందుపై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఆయుర్వేద వైద్యుడు […]
కోవిడ్ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరపున ఉచితంగా అందిస్తామని సీఎం వైయస్ జగన్‌కు నాట్కో ఫార్మా లిమిటెడ్ లేఖ రాసింది. కోవిడ్ –19 చికిత్సలో వాడే బారిసిటినిబ్–4 ఎంజీ (బారినట్) టాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు లేఖలో పేర్కొంది నాట్కో ట్రస్టు. సుమారు లక్ష మంది కోవిడ్ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేయనున్నట్టు తెలిపింది నాట్కో ఫార్మా లిమిటెడ్. రూ.4 కోట్ల 20 లక్షలు మార్కెట్ ఖరీదు చేసే టాబ్లెట్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రులు, […]