పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు
మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీకి సంబంధించిన అనేక కీలక సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోని సెట్స్ వేసి తీస్తున్నారు. దానికి తోడు ఇది పిరియాడికల్ డ్రామా కావడంతో పోర్ట్ సెట్స్ ను గ్రాఫిక్ తో డిజైన్ చేయబోతున్నారు. ఇటు నిర్మాత ఎ. ఎం. రత్నంకు, అటు దర్శకుడు క్రిష్ కు గ్రాఫిక్స్ అంటే చాలా ఇష్టం. క్రిష్ గౌతమీ పుత్ర శాతకర్ణి
మూవీ కోసం అత్యధికంగా గ్రాఫిక్స్ ను ఉపయోగించుకుంటే… ఎ.ఎం. రత్నం భారతీయుడు
మూవీ నుండే ప్రతి సినిమాలూ అవకాశం ఉన్న చోటల్లా గ్రాఫిక్స్ మూవీలో హైలైట్ అయ్యేలా కేర్ తీసుకునే వారు. పైగా ఈ సినిమాలో కథానుగుణంగానే గ్రాఫిక్స్ అవసరం ఉంది.
సో… అందుకోసం ఏకంగా రూ. 50 కోట్ల రూపాయలను విజువల్ ఎఫెక్ట్స్ కు ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఇక ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్
ఆయన అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులనూ మెప్పించడంతో హరిహర వీరమల్లు
కు పవన్ రూ. 50 కోట్ల పారితోషికం తీసుబోతున్నాడట. మొత్తం మీద పవన్ రెమ్యూనరేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కే రూ. 100 కోట్లు అయితే… మరో యాభై కోట్లతో మూవీని చిత్రీకరిస్తారన్న మాట! మరి ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏ స్థాయి లాభాలను రాబడుతుందో చూడాలి.