కరణ్ జోహర్ టైం అస్సలు బాలేదనే చెప్పాలి. చాలా రోజులుగా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. మరీ ముఖ్యంగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కరణ్ జోహర్ విపరీతంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇప్పటికీ నెటిజన్స్ కోపం పెద్దగా ఏం తగ్గలేదు. స్టార్ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తూ స్వయంగా ఎదిగిన వార్ని తొక్కేస్తాడని అతనిపై ముద్ర పడిపోయింది.
అసలే నెపోటిజమ్ ఆరోపణలు, పైగా కరోనా లాక్ డౌన్ కష్టాలు, నష్టాల్లో ఉన్న కేజోకి ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. ‘దోస్తానా 2’ జాన్వీ కపూర్ తో తీయాలని ఆయన చాలా రోజుల కిందట డిసైడ్ అయ్యాడు. హీరోగా కార్తీక్ ఆర్యన్ ని అనుకున్నారు. కానీ, కొంత భాగం షూటింగ్ అయ్యాక ఇప్పుడు యంగ్ హీరోని సినిమా నుంచీ తొలగించారు. దీని వెనుక రాజకీయం ఏంటో ఎవరికీ తెలియదు. ముంబైలో మాత్రం రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. ‘దోస్తానా 2’లోని గే సబెక్ట్ కార్తీక్ కి నచ్చలేదని కొందరంటుంటే… మరికొందరు అతడికి, కరణ్ జోహర్ ఫేవరెట్ స్టార్ కిడ్ జాన్వీకి… పడలేదని అంటున్నారు. నిజం మనకు అంత తేలిగ్గా తెలిసే ఛాన్స్ లేదుకానీ… ప్రస్తుతానికి నిర్మాత కరణ్ ‘దోస్తానా 2’ కోసం మరో హీరోని వెదికే పనిలో పడ్డాడట…
కార్తిక్ ఆర్యన్ స్థానంలో అక్షయ్ కుమార్ రాబోతున్నాడని బాలీవుడ్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇంకా కన్ ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ అదే నిజమైతే అక్షయ్ ఇప్పటికే ‘అత్రంగీ రే’ సినిమాలో యంగ్ బ్యూటీ సారాతో జోడీ కట్టాడు. నెక్ట్స్ ఆయన ఖాతాలో జాన్వీ కూడా చేరుతుందన్నమాట! 50 ప్లస్ వయస్సులోనూ మన ఖిలాడీ 20 ప్లస్ అమ్మాయిలతో రొమాన్స్ చేయటం ఆశ్చర్యమే! అయినా ఆయన ఫిట్ నెస్ తో తెర పై ఎలాగోలా నెట్టుకొస్తాడని కరణ్ జోహర్ నమ్మకం కావచ్చు!