మాధురీ దీక్షిత్ అనగానే మనకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆమె గొప్ప నటి అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అంతకంటే ఎక్కువగా మాధురీ అంటే డ్యాన్స్! ఆమె గ్రేస్ మళ్లీ మరెవరికి లభించేది కాదు. అంతలా తన స్టెప్పులతో నిన్నటి తరాన్ని, నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటోంది సీనియర్ సుందరి! మాధురీ లాంటి మాయాజాలం సంజయ్ లీలా బాన్సాలీతో కలిస్తే? ‘దేవదాస్’ చిత్రంలో మనం ఇప్పటికే ఓ సారి అటువంటి అద్భుతం చూసేశాం! చంద్రముఖి పాత్రలో ఆమె అందాల వెన్నల కురిపించింది. ఒక ముజ్రాకి సైతం నాట్యం చేసి ప్రేక్షకుల్ని మైమరిపించింది. అందుకే, ఇప్పుడు బాన్సాలీతో కలసి మాధురీ మళ్లీ మాయ చేయబోతోందట!
‘హీరా మండి’ పేరుతో దర్శకుడు సంజయ్ బాన్సాలీ ఓ ప్రాజెక్ట్ తలపెట్టాడు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న ‘హీరా మండి’ భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి కథలో కీలక పాత్రలకి ఎంపికయ్యారు. తాజా సమాచారం ప్రకారం మాధురీ కూడా ‘హీరా మండి’లో కనిపించనుందట! ఒక ముజ్రా పాటకి ఆమె స్టెప్పులు వేస్తుందని చెబుతున్నారు. సంజయ్ బన్సాలీ సినిమాల్లో క్యామియోలకి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ‘రామ్ లీలా’ చిత్రంలో హీరోయిన్ దీపికతో సమానంగా ఒకే ఒక్క పాటలో ఆడిపాడిన ప్రియాంక కూడా ప్రచారం సంపాదించుకుంది. మరిక ఈసారి మాధురీ దీక్షిత్ లాంటి గార్జియస్ గాడెస్ స్పెషల్ రొమాంటిక్ సాంగ్ చేస్తోందంటే, ఇక చెప్పేదేముంది