ఆనందయ్య తయారు చేస్తున్న మందు వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కరోనా చికిత్సకు ఆనందయ్య మందు పని చేస్తుందని తిరుపతి ఎస్వీ ఆయుర్వేద యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ భాస్కరరావు స్పష్టం చేశారు. ఆనందయ్యది నాటు మందు కాదు… నాటి మందు అని..ఆనందయ్య మందును ప్రోత్సహించాలని సలహా ఇచ్చారు. కరోనాకు చేస్తున్న చికిత్సలో చాలా సార్లు మార్పులు చేశారని..కంట్లో వేస్తున్న మందు వలన కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కంటిలో వేస్తున్న మందు వలన పల్స్ పెరుగుతుందని…సైన్స్ […]
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. మాల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని దతత్త తీసుకున్న రేవంత్ రెడ్డి…నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స […]
‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు.చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు. ఆరంభంలోనే బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశారు. […]
నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. “కామికాని వాడు మోక్షగామి కాడు” అన్న సూత్రాన్ని రాఘవేంద్రరావు తు.చ.తప్పక అనుసరించారనిపిస్తుంది. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను […]
తౌక్టే తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్ దూసుకొస్తుంది.. ఈనెల 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది.. ఈ అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.. యాస్ తుఫానుగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ఈనెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ […]
వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ఈ రోజు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ […]
కేరళలో పినరాయి విజయన్ నాయకత్వాన ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసింది. నలభై ఏళ్లలో తొలిసారి అక్కడ ఒక ప్రభుత్వం మళ్లీ విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగా పరిగణిస్తున్నారు. 1957లో ఇంఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాతన ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచీ తర్వాత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వావరకూ ఏదీ మళ్లీ గెలిచిందిలేదు.1982 నుంచి ఎల్‌డిఎఫ్ యుడిఎఫ్ ఒకదాని తర్వాత ఒకటి గెలవడమే జరుగుతూ వస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఎల్‌డిఎఫ్ ఒక స్థానం తప్ప […]
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీలను కెసిఆర్ సర్కార్ నియమించింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆ జాబితాను ప్రకటించింది ప్రభుత్వం.వీసీలు : 1.ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరబాద్) వీసీ గా ప్రొ. డి. రవీందర్ యాదవ్ (బీసీ) 2.కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీ గా ప్రో. టి.రమేష్ (బీసీ) 3.తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ […]
కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) లో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి (11) క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్) హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బ్యాంకాక్ నుండి IL.76 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వచ్చిన 3 క్రయోజెనిక్ ట్యాంకర్లను స్వీకరించి ఆక్సిజన్ నింపడానికి ఒడిశాకు రైలులో వెళ్లే ట్యాంకర్లకు బేగంపేట వైమానిక దళం స్టేషన్ వద్ద […]