కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. బ్లాక్ ఫంగస్ గురించి ప్రజలకు తెలిసే లోపే.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశ ప్రజలు దిక్కు తోచని పరిస్థితిని ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో […]
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ నిర్మాత , దర్శకుడు పి. సోమశేఖర్ మృతి చెందారు. ఈయన ప్రముఖ దర్శకుడు రామ్ […]
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. గత వారం రోజులుగా 3 వేలు మించడం లేదు. ఈ నేపథ్యంలో.. జూన్ నెలాఖరులో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని కెసిఆర్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అవకాశం ఉంటే జూన్ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ […]
కర్నూలు జిల్లా.. బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేసిన ఘటనలో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. దీంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. టిడిపి కార్యకర్తల్లో భయాందోళనలు, సృష్టించేందుకే పోలీసుల […]
సిఎం కెసిఆర్ పై మరోసారి బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణలో రైతుల సమస్యలు కెసిఆర్ కు కనిపించడం లేదా అని నిప్పులు చేరిగారు. “తెలంగాణలో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి గోస పడుతున్నారు. మూడు నాలుగు వారాలుగా ధాన్యం అమ్మకాలు లేకపోవడంతో రైతులు కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు అకాలవర్షాలతో రైతులు గజగజలాడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం గారు మాత్రం ఫామ్ హౌజ్ నుండి కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు…. […]
సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. అయితే ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా నమోదయ్యాయి. ఈ ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల […]
ఏపీలో యాస్ తుఫాన్ ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో యాస్ తుఫాన్‌పై అప్రమత్తం ఉండాలని ఫోన్‌లో విజయనగరం జిల్లా కలెక్టర్‌కు సూచినలు ఇచ్చారు మంత్రి వెలంపల్లి. యాస్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్‌కు ఫోన్ లో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉండాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల […]
12వ తరగతి పరీక్షలు, జాతీయ స్థాయి ఎంట్రెన్స్ పై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులు, బోర్డ్ ల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంది కేంద్రం. 25వ తేదీ నుండి ఒకటి లోపు 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్.. విద్యార్థుల రక్షణ, భవిష్యత్ ను దృష్టిలో […]
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి..తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2242 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇదే సమయంలో 4693 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,53,277 కు చేరగా.. ఇప్పటి వరకు 5,09,663 కు మంది కోవిడ్ సోకి కోలుకున్నారు. మరోవైపు కోవిడ్‌తో ఇప్పటి వరకు […]