తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీలను కెసిఆర్ సర్కార్ నియమించింది. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఖరారు చేసిన వీసీల జాబితాపై గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆ జాబితాను ప్రకటించింది ప్రభుత్వం.
వీసీలు :
1.ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరబాద్) వీసీ గా ప్రొ. డి. రవీందర్ యాదవ్ (బీసీ)
2.కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీ గా ప్రో. టి.రమేష్ (బీసీ)
3.తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ గా ప్రో. డి. రవీందర్ (వైశ్య)
4.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరబాద్) వీసీ గా ప్రొ. సీతారామారావు (ఓసి, బ్రాహ్మణ)
5.పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరబాద్) వీసీ గా ప్రొ. టి.కిషన్ రావు ( ఓసి వెలమ)
6.పాలమూరు యూనివర్సిటీ, (మహబూబ్ నగర్) వీసీ గా ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్( ఎస్టీ)
7.మహాత్మాగాంధీ యూనివర్సిటీ, (నల్గొండ ) వీసీ గా ప్రో. సిహెచ్ గోపాల్ రెడ్డి
8.జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరబాద్) వీసీ గా ప్రొ. కట్టా నర్సింహా రెడ్డి (ఓసి)
9.శాతవాహన యూనివర్సిటీ, (కరీంనగర్)వీసీ గా ప్రో. మల్లేశం (ఎస్సీ మాల)
10.జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీ గా , కవిత దర్యాని (ఓసి, సింధి)