కరోనా విలయం : తెలంగాణకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భారీ సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) లో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి (11) క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్) హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బ్యాంకాక్ నుండి IL.76 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వచ్చిన 3 క్రయోజెనిక్ ట్యాంకర్లను స్వీకరించి ఆక్సిజన్ నింపడానికి ఒడిశాకు రైలులో వెళ్లే ట్యాంకర్లకు బేగంపేట వైమానిక దళం స్టేషన్ వద్ద శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫ్లాగ్ అఫ్ చేశారు.
మొదటి బ్యాచ్‌గా 3 ట్యాంకర్లు హైదరాబాద్‌కు వచ్చాయని, బంగాళా ఖాతంలో అవాంతరాలు ఉన్నందున మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచనల మేరకు, రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఎటువంటి కొరత లేకుండా తగురీతిలో ఆక్సిజన్ సరఫరా కోసం అందరు అధికారులు కోవిడ్ వ్యాప్తి నివారణకు నిరంతరం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలోని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్లు, స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం, ట్యాంకర్ల సేకరణకు చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!