తౌక్టే తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్ దూసుకొస్తుంది.. ఈనెల 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది.. ఈ అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.. యాస్ తుఫానుగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ఈనెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా-పశ్చిమబెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక యాస్ తుఫాన్ కారణంగా ఇండియన్ రైల్వే అలెర్ట్ అయింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక రైళ్లు రద్దు అయింది. 64 రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వేశాఖ…రద్దైన రైళ్లలో ఏపి, బెంగాల్, ఒడిషా మీదుగా ప్రయాణిస్తున్నాయి ప్రత్యేక రైళ్లు. అటు తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.