బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై మేయర్ కావటి మనోహర్ మండిపడ్డారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే మీ గురించి నిజాలు మాట్లాడతానని ఫైర్ అయ్యారు. మోస్ట్ సీనియర్, జస్ట్ సీఎం పదవి మిస్ అని చెప్పుకునే మీకు ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసు అని.. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తే 15 వేల ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు మేయర్ కావటి మనోహర్. కార్పోరేషన్ ఎన్నికలలో కన్నా సొంత డివిజన్‌లో 600 ఓట్లు వచ్చాయని..రఘురామకృష్ణరాజు అనే […]
యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపి ప్రభుత్వం. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్దమైంది ప్రభుత్వం. యాస్ తుఫాన్ ప్రభావం ఏపి తో పాటు ఐదు రాష్ట్రాలపై వుంటుందని రాష్ట్ర ప్రభుత్వంను అలెర్ట్ చేసింది కేంద్రం. రూర్కెల, ఒడిషా నుండి 100 మిలియన్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఈనెల 24 లోగా సమీకరణ చేయనుంది. అంగుల్, కరీంనగర్, రూర్కెల నుండి కూడా రోడ్ […]
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ కు కొత్త సమస్య వచ్చింది. తాజాగా ప్రకటించిన WHO అత్యవసర యూజ్ లిస్టింగ్ లో ఇంకా చోటు దక్కలేదు. అయితే WHO అనుమతి ఉన్న టీకాలు వేసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని యూఎస్, యూకే దేశాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి అమెరికా, యూకే లోకి అనుమతించబోమని ఆ దేశాలు అంటున్నాయి. దీంతో భారత్ బయోటెక్ […]
ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సహజమైన మూలికలతో ఆనందయ్య మందు తయారు చేశారని.. 60 వేల మందికి పైగా ఆనందయ్య వద్ద మందు తీసుకున్నారని నారాయణ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా పాజిటివ్ వస్తుందని… ఆనందయ్య మందుపై కార్పోరేట్ కనుసన్నల్లోనే వివాదం జరుగుతుందని తెలిపారు. ఆనందయ్య తయారు చేసిన మందు పంపిణీ చేయాలని… ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి ఆనందయ్య ద్వారా మందు సరఫరా […]
మారుమూల గ్రామాలకు చెందిన రైతులకు సైతం ఆర్థిక చేయూతనిచ్చే లక్ష్యంతో మండలానికో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం 343 మండలాల్లో మాత్రమే డీసీసీబీ బ్రాంచ్‌లున్నాయని, మరో 332 మండలాల్లో బ్రాంచ్‌ల్లేవని, ఆయా మండలాల్లో రానున్న మూడేళ్లలో కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మండలాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు […]
విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం జగన్, సెక్రటరి. ఏకే సింఘాల్, ప్రభుత్వాధికారులకు లేఖ రాశారు తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. విశాఖ జిల్లా బ్లాక్ పంగస్ కేసులపై చర్యలు తీసుకోవాలని…బ్లాక్ పంగస్ కు కెజీహెచ్ లో బెడ్ కేటాయించడమే కాదు… మందులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మందులు లేవని భాధితులు చెప్తున్నారని…ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రులలో […]
సొంత బావతో.. 16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్ననాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన చిన్న కొండయ్య.. తండ్రి కేశవులు చనిపోడంతో తల్లితో కలిసి నాగారం రాఘవేంద్రకాలనిలో ఉంటూ, మేస్త్రి పని చేస్తూ జీవనము సాగిస్తున్నాడు. చర్లపల్లిలో నివాసం ఉంటున్న కొండయ్య.. చిన్న కొండయ్యకు మేనమామ వరుస అవుతాడు. దీంతో కొండయ్య దంపతులు గత సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన తమ […]
హైదరాబాద్ లోని నాచారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐస్ క్రీమ్ తిని సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీలో స్కూబ్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. కేజీ ఐస్ క్రీమ్ లో కొద్దిగా ఉంచి మిగతాది మొత్తం తినేశాడు సంపత్. అయితే ఆ ఐస్ క్రీమ్ తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఇక పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు సంపత్. దీంతో సంపత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంపత్ బంధువుల సమాచారంతో.. […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. డాక్టర్ సుధాకర్ నేపథ్యంలో చంద్రబాబుకు చురకలు అంటించారు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడని ఫైర్ అయ్యారు. “నీకెందుకు నేనున్నా రెచ్చిపో అంటాడు చంద్రబాబు. మీడియా ముందు పులి వేషాలెయ్యమంటాడు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు పొడుస్తాడు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకు అంతే. చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో?” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు […]
నైరుతి రుతుపవనాలు నిన్న (22.05.2021) నైరుతి బంగాళాఖాతము ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం మరియు అండమాన్ నికోబార్ దీవులు యొక్క అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (22.05.2021) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు […]