ఆ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య ‘బుసక’ చిచ్చుపెట్టింది. పక్కపక్క నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒకరు మంత్రిగా ఉంటే మరొకరు ఎమ్మెల్యే. ఎన్నికలకు ముందు ఉన్న సఖ్యత ఇప్పుడు లేదట. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినా అంటీముట్టనట్టు ఉంటోన్న వీళ్ల వ్యవహారం చర్చగా మారింది. వాళ్లెవరో.. ఆ బుసకేంటో.. ఈ స్టోరీలో చూద్దాం. ఇద్దరి మధ్య దూరం పెంచిన ‘బుసక’..! కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్ తొలి కేబినెట్‌లోనే మంత్రయ్యారు […]
కొత్త పీసీసీని ప్రకటించగానే ఆయన తన పదవులన్నిటికీ రాజీనామా చేశారు. అయినప్పటికీ పార్టీ ఆయనతో మాట్లాడుతూనే ఉంది. ఆ నాయకుడు మాత్రం గడప దాటడం లేదు. పాతచోటే ఉంటారా.. లేక కొత్త గూటిని వెతుక్కునే పనిలో పడ్డారా అన్నది అంతుచిక్కడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత మౌనంగానే ఉండిపోయారు! తెలంగాణలో ఆయారాం గయారాంల సందడి పీక్‌కు చేరుకుంటోంది. గోడ దూకేవాళ్లు దూకేస్తున్నారు. మెడలో కొత్త కండువాలు కప్పేసుకుంటున్నారు. కొందరు […]
ఒలింపిక్స్‌లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇవాళ సొంత గడ్డకు రానుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టనుంది. పతకాల సింధుకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. అటు టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధుకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. దేశానికి వన్నె తెచ్చిన వనితను సాదరంగా సత్కరించారు. ఒలింపిక్‌లో కెరీర్‌లో ఒక్క మెడల్ కొడితే గొప్ప అనుకునే సమయంలో.. తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండు పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్‌లో గత ఒలింపిక్స్‌లో రజతం.. […]
ఏపీ బీజేపీ నేతలు హస్తినకు వెళ్లారు. నెల రోజుల వ్యవధిలో వీర్రాజు టీం ఇలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం ఇది రెండో సారి. అయితే ఈ సారి టూర్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో ఆర్థికశాఖ వ్యవహారంపై కేంద్రానికి కంప్లైంట్ చేశారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆమెకు వినతిపత్రం అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఏ రాష్ట్రానికి నిధులు నిలుపదల చేయలేదన్నారు సోము వీర్రాజు. read also : […]
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఒలింపిక్స్ హాకీలో…క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో…ఆస్ట్రేలియాను ఓడించి…సంచలనం సృష్టించింది. మూడుసార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాను మట్టి కరిపించి…సెమీస్‌కు సిద్ధమైంది రాణి రాంపాల్ సేన.ఇవాళ మధ్యాహ్నం మూడున్నరకు జరిగే సెమీస్‌లో అర్జెంటీనాతో రాణి రాంపాల్ సేన తలపడనుంది. అందులో గెలిస్తే.. ఇక మహిళ హాకీ చరిత్ర మలుపు తిరగడం ఖాయం!పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును క్వార్టర్స్‌లో ఓడించడంతో…మహిళల హాకీ జట్టుపై అందరికీ అంచనాలు పెరిగాయ్. సెమీస్‌లోనూ అర్జెంటీనా జట్టును ఓడించి…ఫైనల్‌కు […]
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్. నాటింగ్ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆర్చర్ […]
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. 105పరీక్ష కేంద్రాల్లో దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్ట్ ఇవాళ, రేపు, ఎల్లుండి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, 9, 10 తేదీల్లో […]
ఒలింపిక్స్ లో భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. ఇవాళ జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించాడు. జావెలిన్ విభాగంలో ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు. ఈరోజు మ్యాచ్ లో అందరి కంటే ఎక్కువ దూరం అంటే 86.65 మీటర్లు జావెలిన్ విసిరాడు. 23 ఏళ్ల ఈ ప్లేయర్ తొలిసారి ఒలింపిక్స్ ఆడుతున్నాడు. ఆగస్టు 7న జరిగే ఫైనల్లో టాప్ – 3లో నిలిస్తే ఏదో […]
సీఎం కేసీఆర్ నేడు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. గత జూన్ 22న ఆ గ్రామంలో పర్యటించిన సీఎం.. 42 రోజుల తర్వాత మరోసారి గ్రామానికి విచ్చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. పల్లెబాట కార్యక్రమంలో తొలుత సీఎం దళితవాడలో పర్యటించి, తర్వాత గ్రామమంతా కలియ తిరుగుతూ […]
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే.. బంగారం కొనే వారికి ఓ శుభవార్త. ఇవాళ పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ. 44,900 కి చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ.48,980 కు […]