నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్. నాటింగ్ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆర్చర్ లేకపోవడం.. ఆ జట్టుకు మైనస్ పాయింట్.
ఇక టీమిండియా విషయానికొస్తే.. తుదిజట్టు ఎంపికనే కోహ్లీసేనకు సవాల్‌గా మారనుంది. శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయాలతో దూరం కావడంతో.. రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్ ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేఎల్ రాహుల్, హనుమ విహారి లేదా కొత్త ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. కోహ్లి, పుజారా, రహానే, పంత్‌తో మిడిలార్డర్ స్ట్రాంగ్‌గానే ఉంది. ఇక స్పిన్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల అశ్విన్, జడేజాలకు ఛాన్స్ రావొచ్చు. పేస్ భారాన్ని ఇషాంత్, షమి, బుమ్రాలే పంచుకునే అవకాశముంది. సిరాజ్‌ను ఆడించడం అనుమానమే
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 122 టెస్టులు జరిగాయి. ఇండియా 29, ఇంగ్లండ్ 48 టెస్టుల్లో విజయం సాధించాయి. మొత్తం టెస్టుల్లో 62 ఇంగ్లండ్‌లో జరగ్గా టీమిండియా 7సార్లు మాత్రమే గెలిచింది. రికార్డులు భారతజట్టుకు అనుకూలంగా లేకపోయినా.. ఇటీవలి కాలంలో విదేశాల్లో కూడా టీమిండియా రాణిస్తోంది. ఆగస్ట్, సెప్టెంబర్‌లలో ఇంగ్లండ్ పిచ్‌లు పేసర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఈసారి కోహ్లీసేన.. సిరీస్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశిస్తున్నారు.
- Tags
- england
- india
- Test series
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!