కాసేపటి క్రితమే… రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విడుదల అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వై.సి.పి ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడబోమని చెప్పారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు తోపాటు టిడిపి నేతలు నాకు మద్దతు ఇచ్చి ధైర్యం చెప్పారని.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే అరెస్టు చేశారని..దాడి జరిగిన సమయంలో పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని చెప్పారు. దాడి జరిగిన సమయంలో దాదాపు ఏడు […]
హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లును నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఎలాగైనా హుజురాబాద్ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. […]
ఆ ఎమ్మెల్యేతో అన్నీ పేచీలేనా? పార్టీ నేతలతో గ్యాప్ వచ్చిందా? కేడర్ విసుగెత్తి దూరం జరిగిందా? లోక్‌సభ ఉపఎన్నికపైనా ఆ ప్రభావం పడిందా? అయినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మార్పు లేదా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. స్థానిక వైసీపీ నేతలతో ఎమ్మెల్యేకు విభేదాలు! నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్. గతంలో తిరుపతి ఎంపీగానూ పనిచేశారు ఈ మాజీ ఐఏఎస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో గూడూరు నుంచి […]
ఇంఛార్జ్‌లను వేయకపోతే పార్టీకి ఛార్జింగ్ కష్టమా? కొత్త పోకడలకు చోటు లేదంటోంది ఎవరు?నిర్ణయం తీసుకుంటే ఒక భయం.. తీసుకోకపోతే మరింత ఆందోళన అన్నట్టుగా పరిస్థితి మారిందా? ఇంతకీ ఏంటా పార్టీ? ఏమా ఇంఛార్జ్‌ల గోల? నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించాలని కోరారట! తెలంగాణ బీజేపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. అడ్డుకట్ట వేయడానికి ఆపసోపాలు పడుతున్నారు కమలనాథులు. ఇదే సమయంలో కాషాయ శిబిరంలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అవి ఆచారణ సాధ్యమా కాదా అని పక్కన పెడితే.. […]
ఔను.. వాళ్లిద్దరూ కలిశారు..! అదీ రహస్యంగా..!! తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ సీక్రెట్ భేటీపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట్లో ఉప్పు-నిప్పుగా ఉన్న నాయకులు.. ఒక్కసారిగా హస్తినలో రహస్యంగా సమావేశమై ఏం మాట్లాడుకున్నారు? ఆ బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తోన్న గుసగుసలేంటి? ఎవరు వారు? ఢిల్లీలో రేవంత్, ఉత్తమ్ గంటపాటు రహస్య భేటీ? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఎవరు ఎప్పుడు కలిసి ఉంటారో.. ఎప్పుడు కయ్యాలు పెట్టుకుంటారో తెలియదు. ఇద్దరు కీలక నాయకుల మధ్య తాజా జరిగిన పంచాయితీ ఆ కోవలోకే […]