ఏపీ బీజేపీ నేతలు హస్తినకు వెళ్లారు. నెల రోజుల వ్యవధిలో వీర్రాజు టీం ఇలా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం ఇది రెండో సారి. అయితే ఈ సారి టూర్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో ఆర్థికశాఖ వ్యవహారంపై కేంద్రానికి కంప్లైంట్ చేశారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆమెకు వినతిపత్రం అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఏ రాష్ట్రానికి నిధులు నిలుపదల చేయలేదన్నారు సోము వీర్రాజు.
read also : నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం
కేంద్రాన్ని అనడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రికి, సజ్జలకు నైతిక అర్హత లేదన్నారాయన. సజ్జల రామకృష్ణా రెడ్డిలా తాము దిగజారి మాట్లాడలేమన్నారు సోము వీర్రాజు. మరోవైపు పట్టణ గృహ నిర్మాణ శాఖ మంత్రి హరిజీత్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై ఆయా శాఖలపై రివ్యూ చేయాలని కోరింది ఏపీ బీజేపీ బృదం. ఈరోజు కూడా ఢిల్లీలోనే ఉండే బీజేపీ నేతలు మరికొందరు కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలను కలవనున్నారు.