మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే.. బంగారం కొనే వారికి ఓ శుభవార్త. ఇవాళ పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ. 44,900 కి చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ.48,980 కు చేరింది. బంగారం ధరల బాటలోనే వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.72,700కి చేరింది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ధరలు అమాంతం పెరిగాయి. ఎప్పుడైతే నిబంధనలను సడలించారో అప్పటి నుంచి పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.