పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరోసారి బంగారం ధర తగ్గింది.. గత కొన్ని రోజులుగా పెరిగిన పుత్తడి ధరలు.. నిన్న మరియు ఇవాళ కిందకు దిగుతూ కాస్త ఊరట కలిగించింది.. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో.. రూ.48,160కు దిగివచ్చింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ. 44,140 కు క్షీణించింది. ఇవాళ బంగారం ధర తగ్గగా… మరోవైపు […]
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐపీఎల్ మిగతా సీజన్‌కు స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ జట్టు స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. బట్లర్ భార్య లూయిస్ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుందని, అందుకే మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసింది రాజస్తాన్ రాయల్స్. ఇది ఇలా ఉండగా.. అటు ఐపీఎల్ సెకండ్ సెషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మొదలెట్టింది. సీఎస్కే ప్లేయర్‌లో కెఫ్టెన్ ధోనీ, […]
రాష్ట్రస్థాయి పదువులొస్తున్నాయంటే ఎగిరి గెంతులేశారు. ఏదేదో చేసేద్దామని బోల్డన్ని లెక్కలేసుకున్నారు. తీరా పదవులొచ్చాయక ఏమీ చేయలేక ఆవేదన చెందుతున్నారట. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదట. వారెవరో.. ఆ బాధేంటో ఇప్పుడు చూద్దాం. పదవులు రావడంతో గుర్తింపు లభించిందని సంతోషించారు! ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ పోస్టులతోపాటు డైరెక్టర్ పదవులు దక్కాయి. సామాజికవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని.. […]
ఆ శాఖ అధికారులు రోడ్డెక్కినా.. ఆఫీసులో కూర్చున్నా డబ్బే డబ్బు. ప్రభుత్వ ఖజానాకు ఆ శాఖద్వారా వచ్చే ఆదాయం కంటే.. వారి ప్రైవేట్ సంపాదనే ఎక్కువన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కరోనాతో వ్యక్తిగత ఇన్‌కమ్‌కు గండిపడటంతో విరుగుడు కనిపెట్టారట. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం. ప్రైవేట్ ట్రావెల్స్‌తో సొంత ఒప్పందాలు? అవినీతిలో మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలంటే రెండాకులు ఎక్కువే చదివారని రవాణశాఖపై తరచూ విమర్శలు వస్తుంటాయి. ఆ శాఖలో వెలుగు చూసే యవ్వారాలు కూడా ఆ […]
ఎమ్మెల్యే, మాజీ మేయర్ మధ్య రేగిన రగడ.. కొత్త పుంతలు తొక్కుతోందా? అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్టు పావులు కదుపుతున్నారా? వర్గపోరు అధికారపార్టీలోనూ చర్చగా మారిందా? ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా గొడవ? 2018 ఎన్నికల్లో మొదలైన బొంతు, బేతిల మధ్య రగడ! బేతి సుభాష్‌రెడ్డి. ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈయన బొంతు రామ్మోహన్. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్. ఇద్దరూ అధికారపార్టీ నేతలైనా.. ఉప్పు నిప్పులా ఉందట వీరి మధ్య ఆధిపత్యపోరు. గతంలో రామ్మోహన్ ప్రాతినిథ్యం […]
అమ్మ అడగదు… అడుక్కోనివ్వదు. ఆ పార్టీ నేతల తీరు కూడా అలాగే ఉందట. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై వాళ్లు అడగలేరు. పైగా అడిగేవాళ్లకు అడ్డుపడుతున్నారట. ఈ అంశంపైనే ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. వారెవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏపీకి ఇచ్చిన హామీలపై బీజేపీ నేతలు అడగలేరు? విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అనేక హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెవెన్యూ లోటు భర్తీ దగ్గర నుంచి.. కీలక సంస్థల ఏర్పాటు.. పోలవరం నిర్మాణం.. ప్రత్యేక హోదా.. […]
ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం కొలిక్కి రావడం లేదు. బరిలో దిగే అభ్యర్థిపై క్లారిటీ ఉన్నా.. ప్రకటన చేయడానికి జంకుతున్నారు. వేచి చూద్దాం అనుకుంటున్నారో లేక ఇంకేదైనా వ్యూహం ఉందో కానీ నాన్చడానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. దీంతో ఏమైందో గాంధీభవన్ వర్గాలకు అర్థం కావడం లేదట. రావిర్యాల సభలోనే హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించాలని అనుకున్నారా? హుజూరాబాద్ ఎన్నికపై ఆచి తూచి వ్యవహారం నడిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాలన్నది పార్టీ ఆలోచనగా […]
ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,745 శాంపిల్స్ పరీక్షించగా.. 1085 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 08 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1541 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,60, 91, […]
తాలిబన్లను ప్రపంచమంతా అరాచక శక్తిగానే చూస్తోంది. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి మహిళలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంత దారుణంగా పాకిస్థాన్‌లో మాత్రం తాలిబన్లను కీర్తిస్తున్నారు. తాలిబన్ల విపరీత చేష్టల్ని పొగుడుతూ బాలికలతో పాటలు పాడిస్తున్నారు పాకిస్థాన్ ఛాందసవాదులు. ఇస్లామాబాద్‌లోని మహిళల మదర్సాలో తాలిబన్లను పొగుడుతూ పాటలు పాడారు బాలికలు. జామియా హఫ్సాకు చెందిన లాల్ మసీద్ వద్ద తాలిబన్లకు మద్దతుగా సమావేశం జరిగింది. ఆ ప్రాంతంలో తాలిబన్ల జెండాలు కట్టారు. పాకిస్థాన్‌లో కూడా […]