తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితులపై ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యం లోనే మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళితబంధు […]
దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్‌కు కేంద్ర ఆర్థికశాఖ సమన్లు జారీ చేసింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన కొత్త వెబ్ పోర్టల్ ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు హాజరు కావాలని తెలిపింది. నిన్నటి నుంచి ఐటీ పోర్టల్ అందుబాటులో లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రూ.500 కోట్ల తో పాటు ఇప్పుడు విడుదల చేసిన రూ.500 కోట్లు కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో […]
ఇవాళ బంగారం వ్యాపారులు సమ్మెకు దిగుతున్నారు. అభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ సమ్మె చేయనున్నారు. కేంద్ర నిర్ణయం వల్ల తమ వ్యాపారాలపై ప్రభావం పడిందని, హాల్ మార్కింగ్ కు 10 రోజులు పట్టడమే కారణమని ఆలిండియా జెమ్ అండ్ జ్యూవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ తెలిపింది. దీంతో ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ షాపులు అందుబాటులో ఉండకపోవచ్చు. నకిలీ ఆభరణాలను నియంత్రించేందుకు జూన్ 16 నుంచి కేంద్రం హాల్ మార్క్ రూల్ పెట్టింది. ఇది ఇలా ఉండగా..తాజాగా […]
బడ్జెట్ పద్దులపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. పద్దుల నిర్వహణలో పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్ కేటాయింపుల వినియోగ లెక్కలను ఇవ్వాలని అన్ని శాఖలను ఆదేశించింది.బడ్జెట్ పద్దుల సరైన నిర్వాహాణకు చర్యలు ప్రారంభించింది ఆర్ధిక శాఖ. పద్దుల నిర్వహాణలో వివిధ శాఖల్లో జరుగుతోన్న పొరపాట్లను సరిదిద్దుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎన్ని నిధులు వినియోగించారో చెప్పాలని ఆదేశించింది. అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. కేటాయిపుల్లోని హెచ్చు తగ్గులు, ఆదా చేసిన లెక్కలకు సంబంధించిన వివరాలతో పాటు.. వాటికి వివరణ […]
టీకాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటోంది. దళిత గిరిజన దండోరా సభలతో పాటు…దళిత బస్తీలను సందర్శించనుంది. సభలు నిర్వహించడంతో… కార్యకర్తల లో జోష్ వస్తుంది కానీ…అసలు జనం మనసులో ఏముందో తెలియాలంటే నేరుగా జనంలోకి వెళ్లాలని డిసైడయ్యింది. అందుకే.. ఈనెల 24, 25న జరిగే…దీక్షలకు తోడుగా… దళిత వాడల లో పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. అది కూడా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామం నుంచే ప్రారంభించనుంది. తన దత్తత గ్రామానికే సీఎం […]
హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పరుపుల గోదాంలో మంటలు చెలరేగాయ్. ఐతే…మంటలను గమనించిన కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించాయి. పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…మంటలను అదుపు చేస్తున్నారు. గోదాంలోంచి కార్మికులు బయటకు రావటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై క్లారిటీ […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో..అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్ విజయవంతం కావడంతో సంబరాలు జరుపుకొన్నారు. మల్లన్నసాగర్‌లో ప్రస్తుతం 10 టీఎంసీల […]
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. రేపు ప్రారంభం కావాల్సిన యాత్ర కల్యాణ్ సింగ్ మరణంతో.. 28 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఓ వైపు కిషన్ రెడ్డి జనాశీర్వాద యాత్రతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు చుట్టేశారు. సంజయ్ పాదయాత్ర మాత్రం ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. కొన్నాళ్లు జోరుగా కనిపించిన బండి సంజయ్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. పదే […]
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ అరకోటి మందికి పైగా టీకాలు అందిస్తున్నారు. ఇక తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాలనీలు, బస్తీల్లో కోవిడ్ సంచార టీకా వాహనాలను ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను అందించనున్నారు. 10 రోజులపాటు అర్హులైన అందరికీ వ్యాక్సిన్‌లు అందింబోతున్నారు. వైద్యారోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ […]