అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిందనగానే భయపడిపోతున్నారు అక్కడి మహిళలు. అయితే, పాకిస్థాన్‌లో కూడా దాదాపు అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇటీవల వెలుగు చూస్తున్న వీడియోలు పాకిస్థాన్‌లోని వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఎక్కి ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు యువకులు. దీంతో […]
టీడీపీ నాయకులు గోరంట్ల బుచ్చయ్య రాజీనామా వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తన స్టైల్ లో స్పందించారు. బుచ్చయ్య రాజీనామా వ్యవహారంతో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయంటూ ఆయన పేర్కొన్నారు. “‘బుచ్చయ్య రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని పొరపాటు చేశారని తప్పు బట్టానని చెప్పారు. అలా నిలదీసినందుకు బాబు తనతో రెండేళ్లు మాట్లాడలేదట. ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు. సూపర్ […]
ఆ చారిత్రక నగరంలో కోఆర్డినేటర్లను మార్చినా అధికార వైసీపీ దశ మారడం లేదు. ఇప్పటికే ఇద్దరు కోఆర్డినేటర్లను మార్చి మూడో నేతకు పగ్గాలు అప్పగిస్తే ఆయనా మూతి ముడుచుకుని కూర్చున్నారటా. ప్రభుత్వ పథకాలు.. నామినేటెడ్ పదవులతో రాష్ట్రంలో అన్నిచోట్ల వైసీపీ జోష్‌లో ఉంటే అక్కడ పార్టీ కార్యాలయం వెలవెలబోతుందట. ఇంతకీ ఏంటా నగరం? అక్కడ వైసీపీకి ఏమైంది? లెట్స్ వాచ్! నేతలు ఎక్కువ.. సమన్వయం తక్కువ! అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు రాష్ట్రంలో అధికార […]
తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేకవర్గం స్వరం పెరుగుతోందా? అదను కోసం చూస్తున్న సీనియర్లు గట్టిగానే గళం విప్పుతున్నారా? పీసీసీ చీఫ్ లేని సమయంలో పావులు కదపడం వెనక వ్యూహం ఏంటి? ఎక్కడ సభలు పెట్టాలో చెప్పిన నాయకులే.. బయట మరోలా ప్రచారం చేస్తున్నారా? లెట్స్ వాచ్! రేవంత్ లేని భేటీలో సీనియర్లు జూలు విదిల్చారా? తెలంగాణ కాంగ్రెస్‌లో హడావుడి కామన్. అంతకుమించి అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కామన్. దానికి అద్దంపట్టే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గురువారం నాటి […]
అధికారపార్టీలో అంతా ఉపఎన్నికపై ఫోకస్ పెడితే.. ఇటీవలే కండువా మార్చిన ఆయన మాత్రం ఇంకేదో షో చేస్తున్నారట. ఒంటరిగా వదిలేస్తే.. ఎక్కడ తలనొప్పులు తెచ్చిపెడతారో అని భయపడి.. ఆయన్ని వెంటేసుకుని మరీ తిరుగుతున్నారట సీనియర్ నాయకులు. పైగా బైఎలక్షన్‌ను వదిలిపెట్టి.. సొంత భవిష్యత్ కోసం భారీ స్కెచ్‌లు వేస్తున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరాయన? ఏమా కథ? కౌశిక్‌రెడ్డి చేరినప్పుడు హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు గుర్రు! హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్‌ఎస్. ఈటల రాజేందర్ రాజీనామా […]
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ వర్శిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాకినాడ జెఎన్టీయూ గెస్ట్ హౌజ్ లో ఏకంగా శోభనం జరిపించడం కలకలం రేపుతోంది. ఓ గది లో నూతన వధువరులకు శోభనం తంతు నిర్వహించారట. ఈ నెల 18 న యూనివర్శిటీకి చెందిన మహిళ సాధికారిత డైరెక్టర్ పేరు మీద 201 నంబర్ గల రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ […]
హైదరాబాద్ అంబర్‌పేట్ జన ఆశీర్వాద సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అంబర్‌పేట్ తన ప్రాణమంటూ… కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తాను ఢిల్లీలో ఉన్నానంటే… అది అంబర్‌పేట్ వాసుల వల్లే అన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో కల్వకుంట్ల పాలనను తరిమికొడతామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ప్రధాని మోడీ ఏడేళ్లుగా ప్రజల కోసం పనిచేస్తుంటే… సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని అన్నారు. దేశంలో సచివాలయం లేని రాష్ట్రం… తెలంగాణ మాత్రమే అన్నారు కిషన్‌రెడ్డి. సచివాలయానికి […]
ముగ్గురు పిల్లలను కనేందుకు చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జనాభా తగ్గడంతో కార్మికుల కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. కమ్యూనిస్టు పార్టీ మే నెలలో ప్రతిపాదించిన ముగ్గురు పిల్లల విధానానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది చైనా పార్లమెంట్. తల్లిదండ్రులపై భారం పడకుండా చట్టంలో మార్పులు చేసింది. పన్ను రాయితీ, భీమాతో పాటు…..విద్య, ఉద్యోగం, సొంతిల్లు విషయాల్లో ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. కాగా.. ఈ ఏడాది మే […]
విజయవాడలో యువతి మృతి కలకలం రేపుతోంది. చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రసేన్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె ముఖంపై గాయాలుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రసేన్ కు.. సింధుకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ.. ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రసేన్ ఇంట్లోనే ఆమె ఉంటోంది. సింధు అనుమానాస్పద స్థితిలో […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 364 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 482 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,758 కు చేరగా.. రికవరీ కేసులు 6,44,294 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య […]