టీమిండియాతో రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ టెస్ట్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో ఈ ఇంగ్లీష్ పేసర్ గాయపడ్డాడు. మూడో టెస్ట్ సమయానికి అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం భావించింది. అయితే వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో అతను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. […]
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు కాస్త ఊరట కలిగించాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, డీజిల్ పై 16 పైసలు తగ్గింది. తాజా ధరల ప్రకారం… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. […]
రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర వ్తాప్తంగా నిర్వహించిన ఎంసెట్ ఫలితాలను రేపు విడుదల చేయడానికి అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేశారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే అడ్మిషన్‌కి అర్హత ఉండేది. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ఇంటర్ పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఎంసెట్‌లో క్వాలిఫై అయితే చాలు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంసెట్‌లో ఇంటర్ […]
బెజవాడ అరండల్‌పేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. రాఖీ పండగనాడు తమ్ముడికి రాఖీ కట్టి వెళ్లిన ఆమె ఆ తర్వాత రెండు గంటలకే చనిపోయినట్టు కబురందింది. అయితే అత్తింటివారే ఆమెను చంపేశారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు ఉష, ఫణి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే..! ఉష ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తర్వాత అన్నీ సర్దుకున్నాయ్ అన్న సమయంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయన్నది ఆమె తల్లిదండ్రుల […]
హుజురాబాద్ ఉప ఎన్నిక వేళ.. మళ్లీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ బాస్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇవాళ టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కాబోతోంది. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అలాగే . గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు.. పార్టీ శాఖల ఏర్పాటు కోసం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. దళితబంధు విషయంలో పార్టీ […]
నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు […]
అగ్రిగోల్డ్ బాధితులకు ఇవాళ నగదు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో నగదు చేయనున్నారు. అగ్రిగోల్డ్‌లో 10వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన వారు 3లక్షల 86వేల మందికి ఉన్నారు. వీరి కోసం 207కోట్ల 61లక్షల రూపాయలను జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. అలాగే 10వేల నుంచి 20వేల లోపు డిపాజిట్ చేసి మోసపోయిన వారు మూడు లక్షల మందికిపైగా ఉన్నారు. వీరి కోసం 459కోట్ల 23లక్షలు చెల్లించబోతున్నారు.
మన దేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 44,250 కి […]
దేశంలో యాభై శాతం కూడా వృద్ధి లేదని… బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడి ఉందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకెళుతోందని..అభివృద్ధిపై కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెపుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. వారిది అవగాహన రహిత్యమా ? రాజకీయ లబ్ది కోసమా ? కేంద్రం ఇచ్చిన గణాంకాలే చెప్తున్నా ఇలా మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ రెట్టింపు వృద్ధి రేటు సాధించిందని… తలసరి […]
చార్మినార్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. గంజాయి మాఫియా నే మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా తెలిపారు పోలీసులు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ లో టీ కొట్టు నడుపుకుంటున్న మధుసూదన్ రెడ్డి.. గంజాయి వ్యాపారం చేసే సంజయ్ కుమార్ తో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆంధ్ర నుంచి గంజాయి తెచ్చి హైదరాబాదులో విక్రయం చేస్తున్నా సంజయ్ ముఠా.. మధుసూదన్ రెడ్డి కూడా మెల్లగా […]