తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయ్. తెలంగాణ సీఎం కేసీఆర్..ఏపీ సీఎం జగన్‌కు మహిళలు రాఖీలు కట్టారు. రాజకీయ నేతలకు మహిళా నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలు జరిగాయి. కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి..శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్. అటు…విజయవాడలో రాఖీ వేడుకలు జరిగాయి. సీఎం జగన్‌కు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని.. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక కనిపించదని… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ ఆర్ ఎస్ లో చేరారని చురకలు అంటించారు.తనకు మొదటి నుంచి ఒక చెడ్డ లక్షణం ఉంది.. గొంతులో నుంచి మాట్లాడను.. మనసులో నుంచీ మాట్లాడతాననని తెలిపారు. తెలంగాణ రాజకీయ నాయకులు ఏ.ఎస్.ఐ అధ్వర్యంలో కట్టడాలను గుర్తించడం లో వైఫల్యం చెందారని.. మతంతో కట్టడాలకి సంబధం లేదని తెలిపారు. […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు/ పశ్చిమ గాలులు వీస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, […]
సీఎం కేసీఆర్ పై మరోసారి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని కెసిఆర్ దత్తత తీసుకొని ఏం చేయలేదని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. అలాంటి ది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. అందుకే మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష పెట్టనున్నామని తెలిపారు. ఈ దీక్ష తో కెసిఆర్ గ్రామానికి ఎం చేశాడో ప్రజలకి చూపిస్తామన్నారు. దీక్ష సమయంలో నైట్ దళితుల ఇంట్లోనే పడుకుంటానని తెలిపారు. ఈటెల రాజేందర్ బీజేపీ లో […]
చార్మినార్ లో ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి మరీ… హత్య చేశారు. అయితే.. ఈ హత్యను అతని మిత్రులే చేయటం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఈ నెల 19వ తేదీన వ్యాపార వేత్త మధుసూదన్ రెడ్డి ని అతని మిత్రులు కిడ్నాప్ చేశారు. మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి 40 లక్షల రూపాయల రుణం తీసుకున్న మిత్రులు… తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే కిడ్నాప్ చేశారు. అయితే… కిడ్నాప్ తో ఆగకుండా అతన్ని […]
సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోందని.. కానీ ఈ రోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారే మహిళలతో అగౌరవంగా మాట్లాడుతుండటం మన దురదృష్టమన్నారు. […]
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,150 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 48,170 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక బంగారం ధరలు దారిలోనే […]
పాఠశాలల రీ-ఓపెన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం టేబుల్ పై ఉందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేయడం వల్ల ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్రస్మా ప్రతినిధులు ఎమ్మెల్సీ పల్లాకు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా పల్లా చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే […]
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (89) మృతి చెందారు. లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితమే మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్యాణ్ సింగ్… పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కళ్యాణ్ సింగ్ రెండు సార్లు సీఎం గా పనిచేశారు. అలాగే రాజస్థాన్ మరియు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా కూడా కళ్యాణ్ సింగ్ పనిచేశారు. కాగా కళ్యాణ్ సింగ్ మృతి పట్ల పలువురు […]
తాలిబన్ల పాలన మాకొద్దు.. అంటూ లక్షలాది మంది కాబుల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ బయట తాలిబన్లు.. లోపల విదేశీ బలగాలు పహారా కాస్తున్నాయ్. రోజులకొద్దీ అక్కడే ఉండటంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళల ఆర్తనాదాలు, పసి పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయ్. కొందరైతే తమ పిల్లలైనా కాపాడాలంటూ పిల్లలను విదేశీ బలగాలకు ఇచ్చేస్తున్నారు. ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల […]