2021 టీ 20 ప్రపంచ కప్ నేపథ్యంలో టీమిండియా జట్టుకు మెంటర్ గా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్‌కు టీమిండియా మెంటర్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదని సమాచారం. గౌరవ వేతనం తీసుకోకుండానే మెంటార్‌గా పనిచేసేందుకు ధోని అంగీకరించారని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. కెప్టెన్‌గా ఎంతో అనుభవం ఉన్న ధోని… టీమిండియాకు ఎంతో […]
హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి రాజకీయ నాయకుల ఫోకస్ అంతా ఇక్కడే నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ తగ్గెదెలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో నేతలంతా ఓటర్లు చుట్టూ తిరగాల్సిన ఉండగా ఆసుప్రతుల చుట్టూ తిరుగుతుండటం ఆందోళన రేపుతోంది. హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు […]
తెలంగాణలో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో అత్యంత కాస్లీ ఉప ఎన్నికగా హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డుకు ఎక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితం చివరి వరకు దోబుచులాట ఆడే అవకాశం ఉండటంతో ఇక్కడి ప్రతీ ఓటు కీలకంగా మారింది. దీంతో నేతలు ఈ అంశంపై […]
‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా?..’ అన్నట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు. ఐటీని తామే ప్రవేశపెట్టమని.. సాంకేతికతకు తామే ఆద్యులమని చెప్పుకునే టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నారన్న టాక్ నడుస్తోంది.. సాంకేతిక ప్రవేశపెట్టడం కాదు.. దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలంటూ వారిపై […]
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేసిన కైజాద్ కపాడియా బుధవారం కన్నుమూశాడు. ఎంతోమంది జీవన శైలిని మార్చిన కైజాద్ బాలీవుడ్ సెలబ్రిస్ ను సైతం తన వైపు తిప్పుకున్నాడు. అనేకమంది బాలీవుడ్ నటులకు ఆయన ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నారు. కైజాద్ హఠాన్మరణం పట్ల టైగర్ ష్రాఫ్ ఉదయమే సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలిపాడు. టైగర్ తల్లి ఆయేషా, సిద్ధాంత్ కపూర్, […]
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రతి రోజూ మీడియాలో నానుతూనే ఉంది. అయితే అక్టోబర్ 15 న దసరా సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల తెలుగులోనూ సమంత ఓ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శక ద్వయం రాజ్ డికె తో మరో […]
సి.ఎల్.ఎన్ మీడియా నిర్మించిన ‘పాయిజన్’ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ‘పాయిజన్’ ఒకే సారి విడుదల కాబోతోంది. ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ ప్రాంతాల్లో విభిన్నమైన లొకేషన్లలో భారీ స్థాయిలో చిత్రీకరించామని, దర్శకుడు శ్రీ రవిచంద్రన్ కథ, స్క్రీన్ ప్లే స్టైలిష్ తెరకెక్కించారంటున్నారు నిర్మాత. ఫ్యాషన్ తో పాటు గ్లామర్ ఉన్న ఇండస్ట్రీలో జరిగే మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ […]
ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న పక్కా యూత్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ బాయ్స్’. అన్ని ఎలిమెంట్స్‌ను డైరెక్టర్ శ్రీహర్ష పక్కాగా, చక్కగా బ్లెండ్ చేసి […]
మొత్తానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం థియేటర్ల ఆక్యుపెన్సీని నూరుశాతానికి పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 14వ తేదీ నుండే అమలు కాబోతోంది. దాంతో రేపు విడుదల కాబోతున్న ‘మహా సముద్రం’ చిత్రంతో పాటు ఎల్లుండి, 15వ తేదీ జనం ముందుకు రాబోతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘పెళ్ళిసందడి’ చిత్రాలకు బోలెడంత మేలు చేసినట్టు అయ్యింది. పైగా కర్ఫ్యూ సమయాన్ని సైతం అర్థరాత్రి 12 గంటల నుండి ఉదయం […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది. రాగల 24 గంటలలో మహారాష్ట్ర, తెలంగాణ లలోని మరికొన్ని ప్రాంతముల నుండి మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతముల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశాలు ఉన్నాయి. తూర్పుమధ్య బంగాళాఖాతం & దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనము […]