హుజురాబాద్ లో కొత్త టెన్షన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి రాజకీయ నాయకుల ఫోకస్ అంతా ఇక్కడే నెలకొంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ తగ్గెదెలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో నేతలంతా ఓటర్లు చుట్టూ తిరగాల్సిన ఉండగా ఆసుప్రతుల చుట్టూ తిరుగుతుండటం ఆందోళన రేపుతోంది. హుజూరాబాద్ లో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలంతా హుజూరాబాద్‌లో తిష్టవేశారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రి గుంగుల కమాలకర్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. గంగుల కమాలకర్ సైతం తనతో తిరిగిన నేతలంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో అప్రమత్తమైన నేతలంతా ఇప్పుడు ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నేతలంతా కరోనా టెస్టులు చేయించుకుంటూ రిజల్ట్ పాజిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్కరోజే 28మంది నేతల వరకు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా హుజూరాబాద్ ఆసుప్రతిలో మధ్యాహ్నం ఒంటిగంట వరకే కరోనా టెస్టులు కోసం షాంపిల్స్ సేకరిస్తున్నారు. దీంతో నేతలంతా ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నేతలంతా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు డ్రై ఫ్రూట్స్ ఆహారంగా తీసుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉంటే కరోనా టెస్టులకు రిజల్ట్ కు రెండు మూడ్రోజుల సమయం పడుతుండటంతో నేతలు తమకు పాజిటివ్ వస్తుందా? నెగిటివ్ వస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Tollywood Sankranthi : 2027 సంక్రాంతి సినిమాల సంగతేంటి?
-
Ramayana: తెలుగు రాష్ట్రాలో దిల్ రాజు బ్యాకింగ్‌తో వస్తున్న ‘రామాయణ’!
-
Box Office: యంగ్ హీరోల వందల కోట్ల రిస్క్! నిర్మాతలకు ముప్పు తప్పదా?
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!