సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… శ్రీవారి దర్శనార్థం ఇవాళ తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం తిరుపతికి చేరుకునే ఆయన తిరుచానూరుకు వెళ్తారు. అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోన్నారు. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోన్నారు. అంతేకాదు… ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్న ఎన్వీ రమణ… రేపు చక్రస్నానంలో పాల్గొననున్నారు. […]
క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని సహచరుల బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో NCB ఉన్నట్టు స్పష్టమవుతోంది.ముంబై సెషన్స్ కోర్టులో నిన్న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగినప్పుడు… అతను బయటకొస్తే సాక్ష్యాలు తారుమారైపోతాయనే ఆందోళన వ్యక్తం చేసింది NCB. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని… అది పూర్తయ్యే వరకూ ఆర్యన్‌ను విడుదల చేయవద్దని NCB కోరింది. రైడ్ జరిగినప్పుడు ఆర్యన్ […]
బిగ్ బాస్ సీజన్ 5లో రెండు రోజుల పాటు సాగిన బొమ్మల తయారీ టాస్క్ వ్యూవర్స్ సహనానికి పరీక్ష పెట్టింది. హౌస్ లోని సభ్యులకు రెండు రోజుల పాటు ఏదో ఒక పని చెప్పి కాలయాపన చేయడానికే బిగ్ బాస్ ఈ గేమ్ పెట్టారేమో అనిపిస్తోంది. 37వ రోజు, 38వ రోజు కూడా సాగిన ఈ ఆటకు ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు. అయితే… అసలు కథ ఆ మర్నాడు ఉంటుందన్నట్టుగా బిగ్ బాస్ ఈ టాస్క్ […]
కోల్‌కత నైట్‌రైడర్స్ ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీపై 3 వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి ఓవర్ ఐదో బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో… కోల్‌కతాదే పైచేయి అయింది. విజయానికి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో… కోల్‌కత బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠీ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. రేపు చెన్నై-కోల్‌కత మధ్య ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగనుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ… 20 ఓవర్లలో 5 […]
ఆ ముగ్గురు పార్టీని వాడేసుకున్నారని అనుమానం వచ్చిందా? వస్తాం అనగానే వచ్చేయ్యండని కండువాలు కప్పేసిన ఆ పెద్ద పార్టీ ఇప్పుడు వారిని దూరంగా పెడుతోందా? ఇంట్లోనే కట్టేసుకోవాలని చూస్తోందా? బీజేపీతో ముగ్గురు ఎంపీలు అంటీముట్టనట్టు ఉంటున్నారా? సాధారణ ఎన్నికలు అయ్యి అవగానే టీడీపీలో ఓ వెలుగు వెలిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టి.జి. వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వాళ్లతో ఏం ఒప్పందం చేసుకుందో… లేక వాళ్లే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారో కానీ… […]
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం అంతా దర్బార్ చుట్టే తిరుగుతుందా? హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసే వరకు సమస్య వెళ్లిందా? కంప్లయింట్స్ వెనక ఉన్నది ఎవరు? ఇంతకీ దర్బార్ ఏంటి..? రేవంత్ పేరుతో ఉన్న సోషల్ మీడియా గ్రూపులపై హైకమాండ్‌కు ఫిర్యాదు..! తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. చీమ చిటుక్కుమన్నా.. పార్టీ హైకమాండ్‌కు కంప్లయింట్స్ వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ మీడియా ముందు బయటపడితే.. ఇప్పుడు అంతా ఈమెయిళ్లపై కథ నడిపించేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలు లేవని.. ఉద్యమాలు చేయడం లేదని ఇప్పటి […]
సీఎం కేసీఆర్ వదిలిన బీసీ బాణం.. బీజేపీని ఇరుకున పడేసిందా? బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచారా? ఈ అంశం హుజురాబాద్‌లో అధికారపార్టీకి కలిసి వస్తుందా? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? దేశ రాజకీయాలలో బీసీ కుల గణనకు డిమాండ్స్..! బీసీ కుల గణన ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్ కూడా ఇదే. వెనకబడిన వర్గాలకు చెందిన పలు సంఘాలు కూడా ఇదే శ్రుతి […]
ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో టాస్ ఓడి… మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. 20 ఓవరల్లో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి.. కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36 పరుగులు , శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, మినహా […]
హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్ డౌన్ మొదలైంది. ఆక్టోబర్ 30కి ఇంకో పక్షం రోజులే ఉంది. దాంతో ప్రచారం రోజు రోజుకు ఉదృతమవుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్, బీజేపీ గెలుపు కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాయి. గడగడపకు వెళ్లి ఓటర్లకు తమ వాదన వినిపిస్తున్నారు. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.అయితే ఓటర్లు చాలా తెలివైన వారు కదా.. అందుకే ఎవరు ఏం చెప్పినా సైలెంట్‌గా తల ఊపు ఊరుకుంటున్నారు. ఎవరు గెలుస్తారని […]
ముంబై క్రూయిజ్‌షిప్ కేసులో ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుపుతోంది న్యాయస్థానం. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం. దీంతో నాలుగోసారి బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఆర్యన్ తరపు న్యాయవాది. అయితే, ఈ కేసులో ఎన్‌సీబీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది ఎన్‌సీబీ. ఈ కేసులో అరెస్టైన మిగతావారిలాగే ఆర్యన్‌ఖాన్‌కు కూడా సంబంధం ఉందని వాదనలు వినిపించింది. ఆర్యన్‌ఖాన్‌ను, మిగతావారిని వేరు చేసి చూడలేమని చెప్పింది ఎన్‌సీబీ. […]