2021 టీ 20 ప్రపంచ కప్ నేపథ్యంలో టీమిండియా జట్టుకు మెంటర్ గా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ఏడాది టీ-20 వరల్డ్ కప్‌కు టీమిండియా మెంటర్‌గా ఎంపికైన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదని సమాచారం. గౌరవ వేతనం తీసుకోకుండానే మెంటార్‌గా పనిచేసేందుకు ధోని అంగీకరించారని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. కెప్టెన్‌గా ఎంతో అనుభవం ఉన్న ధోని… టీమిండియాకు ఎంతో ఉపయోగపడతారని క్రికెట్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. అటు ధోని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులతో పాటు ధోని ప్యాన్స్ ఖుషీ అవుతున్నారట. కాగా.. 2021 టీ 20 ప్రపంచ కప్… అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.