సి.ఎల్.ఎన్ మీడియా నిర్మించిన ‘పాయిజన్’ సినిమా మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ‘పాయిజన్’ ఒకే సారి విడుదల కాబోతోంది. ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ ప్రాంతాల్లో విభిన్నమైన లొకేషన్లలో భారీ స్థాయిలో చిత్రీకరించామని, దర్శకుడు శ్రీ రవిచంద్రన్ కథ, స్క్రీన్ ప్లే స్టైలిష్ తెరకెక్కించారంటున్నారు నిర్మాత. ఫ్యాషన్ తో పాటు గ్లామర్ ఉన్న ఇండస్ట్రీలో జరిగే మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇదని, ఇందులో ఐదుగురు సుప్రసిద్ధ మోడల్స్ హీరోయిన్స్ గా నటించారంటున్నారు. షఫీ ఏ.సి.పి గా నటించిన ఈ సినిమాలో హీరో రమణ తనదైన మేనరిజంతో యాటిట్యూడ్ ఉన్న పాత్ర పోషించినట్లు దర్శకుడు చెబుతున్నారు. వరల్డ్ లో గేమింగ్ మ్యూజిక్ లో 636 స్థానంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ నిహాల్ సంగీతం హైలైట్ అవుతుందని నిర్మాత శిల్పిక అంటున్నారు.