ప్రముఖ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న పక్కా యూత్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ బాయ్స్’. అన్ని ఎలిమెంట్స్‌ను డైరెక్టర్ శ్రీహర్ష పక్కాగా, చక్కగా బ్లెండ్ చేసి సినిమాను రూపొందించారు. కాలేజ్ డేట్ నైట్ సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. జానీ మాస్టర్ ఈ సాంగ్‌ను ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ ట్రాక్, టీజర్‌ను ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఆశిష్, విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ పర్ఫామెన్స్, శ్రీహర్ష టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్ ఇచ్చాడు. అలాగే బీజీఎం నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంది. మదిగారి విజువల్స్ సింప్లీ సూపర్బ్. ఇది వరకు చెప్పినట్లు టైటిల్ ట్రాక్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. త్వరలోనే మిగిలిన సాంగ్స్‌ను రిలీజ్ చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.