బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ నిన్న ( అక్టోబర్ 24న ) దసరా వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఈ ఘనత సాధించింది.
నిజ్జర్ హత్య ఆరోపణలతో భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అటువంటి పరిస్థితిలో కెనడా కన్జర్వేటివ్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు పియర్ పోయిలీవ్రే మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న తరువాత, ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంతో సంబంధాల విలువను అర్థం చేసుకోలేకపోయారు అని ఆయన అన్నారు.
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నీ స్దాయి ఏంటి.. నోటికోచ్చినట్లు మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానికి ఒక మంచి భాషా కూడా మాట్లాడలేకున్నావ్.. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా నువ్వు ఇప్పుడు వందల ఎన్ని కోట్లు ఎలా సంపాదించావో సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ము నీకుందా అని ఆమె ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ఆర్థిక అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు.
భారత్లోని డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మివేసేందుకు రెడీ అయింది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని పలు నివేదికలు పేర్కొన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి వాతావరణం కనబడుతుంది. గత మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. కానీ, రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు చల్లని గాలులు వీస్తున్నాయి.
టీడీపీ- జనసేన పార్టీల పొత్తులపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్, లోకేష్ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు.. పాడుతా తీయగా కార్యక్రమంలాగా ఇటు ఆరుగురు ఆడు ఆరుగురు కూర్చుని సెలక్షన్ చేశారు.. ఆర సున్న.. ఆర సున్న కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించారు అనడం కామెడిగా ఉంది అని ఆమె సెటైర్లు వేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రికి పైకి భవానీలు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతుంది. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్ లలో భక్తులు వేచి ఉన్నారు.