దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. మొత్తం 11 మంది నిందితులకు పదేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్ట్ ఇవాళ తుది తీర్పును ఇచ్చింది.
గజ్వేల్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు అనగానే చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడతారు.. మనల్ని మభ్య పెడతారు.. నవంబర్ 30 తరువాత గజ్వేల్ లో ఎవరు ఉండరు అని ఆయన పేర్కొన్నారు.
రైతు బంధు పథకం కొత్తది కాదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసీనీ కాంగ్రెస్ నేతలు కలిసి రైతు బంధు ఆపాలని కోరింది అని ఆయన తెలిపారు. కేసీఅర్ రైతు బంధు తర్వాతే కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకు వచ్చింది.. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు.. 69 లక్షల మందికి రైతు బందు అందుతోంది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీజు గడువు తేదీలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అయితే, ఇవాళ్టి నుంచి అనగా ( అక్టోబర్ 26)వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ స్టార్ట్ అయి.. నవంబర్ 14వ తేదీ వరకు ఎలాంటి జరిమానా లేకుండా విద్యార్థులు ఫీజును చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
రేపు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. రేపు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన సందర్భంగా భారీ వాహనాలకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు.. నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు, నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇయ్యు, నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు, నిన్న ( బుధవారం ) మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తుపాకీ చోరీ కలకలం రేపుతుంది. 30 రౌండ్లతో కూడిన ఇన్సాస్ 60 వెపన్ చోరీ అయింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు చెందిన ఇన్సాస్ 60 వెపన్ మాయం అయిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. గజ్వేల్ నాకు కొత్త కాదు..మీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది.. నేను గజ్వేల్ వచ్చింది నాకు నియోజకవర్గం లేక కాదు.. 20 సంవత్సరాలు నాతో పని చేయించుకుని నా మెడలు పట్టుకుని బయటికి గెంటేశారు అని ఆయన ఆరోపించారు.
నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హేమా హేమీలకు ఓటమి తప్పదు.. ఎన్నికల్లో ఓడిపోయిన కవితకు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని ధర్మపురి అర్వింద్ అన్నారు.