బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమావేశం కానున్నారు. పార్టీ అభ్యర్థులకు గులాబీ బాస్ బీ-ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం.. అనంతరం 12.15 నిమిషాలకు మ్యానిఫెస్టో విడుదల, మ్యానిఫెస్టోపై ప్రసంగం చేయనున్నారు.
ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనిపించనున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి స్వపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేసేశారు. దీంతో తొలి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరుకుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏసీ ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. గత నెల రోజులుగా అభ్యర్థుల పేర్ల ప్రకటనకు రేపు మాపు అంటూ ఊరిస్తూ.. నేడు తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఇవాళ ప్రకటించనుంది.
తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.