కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పై తారురోడ్డు డ్యామేజీ కావడంతో.. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డిలు కేబుల్ బ్రిడ్జ్ నాణ్యతని పరిశీలించారు.
రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు ఈ ఎన్నికలు.. ఒక్క కేసీఆర్ ను కొట్టడానికి ఎన్ని సమీకరణాలు మారుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు.. రైతులు, మహిళలను ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది.. మైనార్టీల ఓట్లు డివైడ్ కావడం వల్ల ప్రజలకు నష్టం.. కాంగ్రెస్ కు ఎన్నికలు ఓ ఆట.. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గా చూస్తోంది అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.
ఢిల్లీ పాలకుల చేతుల్లో అధికారం పెడితే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతా.. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరీక్షించే నాయకునికి పట్టం కట్టాలి అని మంత్రి గంగులా కమలాకర్ కోరారు.
రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది.. పార్టీ కార్యకర్తల కృషి, శ్రమతో మా కార్యకర్తలు రక్తాన్ని చిందిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అటువంటి బిజెపిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు.. జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడం సరైంది కాదు అని లక్ష్మణ్ తెలిపారు.
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అధికార వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు.
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాక్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు ముందే పాకిస్తాన్ టీమ్ కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది.
ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్కు కూడా దూరం కానున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్మెంట్ అతడికి రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్.
నాకు మద్దతు ఇవ్వండి.. 20 ఏండ్లు నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందాం అని పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే వారికి మాటిస్తున్నాను.. వచ్చే ఐదేళ్లు మీ సేవలో ఉంటా.. ఐదోసారి ఓడిపోయినా.. భువనగిరి ఎంపీగా గెలిపించారు అంటూ కోమటిరెడ్డి తెలిపారు.