డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏపీ డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను జాగ్రత్తగా ఎదుర్కోవాలి.. పోలీసులు ప్రజలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.
మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా ఉన్నారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధి ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకున్నారు. 29, 209 మంది తలనీలాలు సమర్పించారు.
తమిళనాడులో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నటి, బీజేపీ నాయకురాలు గౌతమి తాడిమళ్ల బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గౌతమి తాడిమళ్ల లేఖ ద్వారా తెలియజేశారు
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం కూడా ఇదే.. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా కనకదుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అయితే, అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిషాసుర మర్ధిని అవతారంలో, 2 గంటల నుంచీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలోనూ దర్శనం ఇస్తారు.
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసుల అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవుతుంది. రాజమండ్రిలో మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన ఈ తొలి జేఏసీ సమావేశం జరుగనుంది.