తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. నేడు విజయదశమి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు, రిమాండ్ ఖైదీల కుటుంబ సభ్యులు సహకరించాలని జైలు అధికారులు కోరారు.
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండపై కొలవైన ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దసరా తరువాత స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి గొడవల వల్ల కర్రల సమరంగా ఆ పేరు వచ్చింది.
నేడు మేడిగడ్డకు కేంద్ర జలసంఘం సభ్యులు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ పరిశీలన..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు.
నెల్లూరు జిల్లాలో అక్రమాలు, దోపిడీలే కాకుండా ఎన్నికలలోపు వేల కోట్ల రూపాయలు దోపిడీకి వైసీపీ నేతలు తెర తీశారు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్వార్ట్జ్ ఖనిజానికి ఇతర దేశాల్లో డిమాండ్ ఉండటంతో వైసిపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు.
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాకాత్ ముగిసింది అని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు అందర్నీ ధైర్యంగా ఉండమన్నారు.. ప్రజలంతా ఆయన ఎప్పుడూ బయటికి వస్తారా అని ఎదురుచూస్తున్నారు.
తెలుగు ప్రజలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ మా అందరికి బాధాకరమైన విషయం.. తితిలీ తుఫాన్ సమయంలో మా జిల్లా ప్రజలతో కలిసి బాబు దసరా జరుపుకున్నారు.. ప్రజా నాయకుని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని ఆయన ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు మునిగిపోయాయి.. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు.