ఇవాళ్టి నుంచి ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. అయితే, ఈ నెల 29 వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 26న స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం, అలాగే 27న రథోత్సవం, ఇక 28వ తారీఖు మధ్యాహ్నం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని అధికారులు మూసి వేయనున్నారు. దీంతో 29వ తారీఖు ఉదయం ఆలయం తెరిచి శుద్ధి చేసిన తర్వాత.. రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవాల సమయంలో ఆలయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు క్యానిల్స్ చేసినట్లు ద్వారకా తిరుమల ఆలయ అధికారులు వెల్లడించారు.
Read Also: Telangana: తెలంగాణలో చలి తీవ్రత.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
అయితే, ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు చిన వెంకన్న స్వామివారిని దర్శించి తమ మొక్కులను సమర్పిస్తారు. అయితే పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కులను సైతం చిన తిరుపతిలో తీర్చుకున్న ఆ మొక్కు స్వామికి చేరుతుందని భక్తుల నమ్మకం. ఇక, ద్వారక మహర్షి చాలా కాలం పాటు తపస్సు చేయడంతో ఆయన చుట్టూ పుట్ట పెరిగింది. అయితే స్వామివారు ద్వారక మహర్షి తపస్సుకు ప్రసన్నమై ద్వారకాలోనే స్వయంభువుగా వెలిశారు. అయితే స్వామివారి నడుము నుంచి సగభాగం ఆ పుట్టతో కప్పబడింది.